365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 5,2024:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు తన చిన్ననాటి స్నేహితులు, సరస్వతి శిశుమందిర్ క్లాస్ మేట్ల మధ్య జరిగిన సంభాషణ ఇది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు బండి సంజయ్ చిన్ననాటి స్నేహితులు 35 మంది హైదరాబాద్ వచ్చారు. ఎల్బీనగర్ సమీపంలో మన్సూరాబాద్ లో బండి సంజయ్ ఉన్నారని తెలుసుకున్న వారంతా అక్కడికి వచ్చారు.
పుల్లూరి శ్రీనివాసరావు, బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగం మీనాకుమారి, బుట్టి మంజుల, కె.లత, పి.శ్రీదేవి, ఎం.శోభారాణి, చెన్నాడి ప్రవీణ్ రావు, తనుగుల శ్రీధర్, తోట ప్రకాశ్, నార్ల మహేందర్, పుల్లూరు రంగారావు, వైద్య సంజయ్, వెల్దండి వేణు మాధవ్, తాటిపల్లి శ్రీనివాస్, ముక్కా శ్రీధర్, భువనగిరి శ్రీధర్, చిటుమల్ల శ్రీనివాస్, గసిగంటి మోహన్, కామారపు నరేందర్, మేడిశెట్టి సంజయ్, చెరుకుతోట శ్రీనాథ్ రావు, రేపాల శ్రీనివాస్, శ్రీరామోజు యోగింద్రనాధ్, కాడర్ల వేణుమాధవ్ తదితరులంతా బండి సంజయ్ ను కలిశారు.
అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ, పాత జ్ఝాపకాలను నెమరేసుకుంటూ సరదాగా గడిపారు. చిన్నప్పుడు చేసిన అల్లరి, దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ తన ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ…ఎవరెవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవడంతోపాటు వారి కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
ఆ తరువాత అందరితో కలిసి ఫోటోలు దిగారు. తన చిన్ననాటి స్నేహితుడిని కలవడంతో వాళ్లందరి ఆనందానికి ఆవధుల్లేవు. సంజయ్ బిజీబిజీగా ఉన్నప్పటికీ అక్కడే దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కు తినిపించారు. తిరిగి పయనమయ్యేటప్పుడు సైతం సంజయ్ ను కలిసి మళ్లీ కలుద్దాం… ఈసారి ఏదైనా ఈవెంట్ పెట్టుకుందామని చెబుతూ వెళ్లిపోయారు.
ఇదికూడా చదవండి:అస్సాంలో టాటా గ్రూప్ 27,000 మందికి ఉపాధి కల్పించే సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ప్రారంభం