365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్ట్ 13, 2024: టెక్నాలజీ ఆధారిత హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సంస్థ ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ )ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ డియా సెబీకి సమర్పించింది. కంపెనీ ప్రధానంగా అమెరికా మీద ఫోకస్‌తో కెనడా మరియు ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కింద ఆఫర్ ఫర్ సేల్ విధానంలో రూ. 1 ముఖ విలువ చేసే 2,81,84,060 వరకు షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. ప్రమోటర్ గ్రూప్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన ఆష్రా ఫ్యామిలీ ట్రస్ట్ 53,47,924 వరకు, ఆర్యమాన్ ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరి ట్రస్ట్ ట్రస్ట్ 17,08,846 వరకు, ఆర్యవీర్ ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరి ట్రస్ట్ 17,08,846 వరకు, నిష్ట ఝున్‌ఝున్‌వాలా డిస్క్రిషనరి ట్రస్ట్ 17,08,846 వరకు షేర్లను, ఇండివిడ్యుయల్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లయిన జోసెఫ్ బెనార్డెలో 43,75,387 వరకు, గౌతమ్ చార్ 18,00,000 వరకు, పర్మీందర్ బొలినా 16,41,232 వరకు, ఫిలిప్ ఫ్రెయ్‌మార్క్ 16,41,232 వరకు, బెర్జిస్ మినూ దేశాయ్ 10,32,894 వరకు, స్కాట్ డి హేవర్త్ 9,37,858 వరకు షేర్లను విక్రయించనున్నారు.

2024 మార్చి 31 నాటికి ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్‌కి 800 పైచిలుకు హెల్త్‌కేర్ సంస్థలు, క్లయింట్లుగా ఉన్నాయి. వీటిలో హెల్త్ సిస్టమ్స్, అకడమిక్ మెడికల్ సెంటర్స్, మల్టీ-స్పెషాలిటీ మెడికల్ గ్రూప్స్ మొదలైనవి ఉన్నాయి.

మాస్ జనరల్ బ్రిఘాం, టెక్సాస్ హెల్త్‌కేర్, ది జీఐ అలయెన్స్ మేనేజ్‌మెంట్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా 13,241 మంది ఉద్యోగులతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలో కంపెనీ సేవలు విస్తరించింది. అమెరికాలో ప్రొవైడర్ ఎనేబుల్‌మెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ మార్కెట్ 2028 నాటికి 323 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా.

ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్, జేపీ మోర్గాన్ ఇండియా, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.