Tue. Apr 30th, 2024

365తెలుగు డాట్ కాం ఆన్లైన్ న్యూస్, జులై 1హైదరాబాద్ :  వైద్యో నారాయణో హరి అంటే సాక్షాత్త్తూ నారాయణుడే వైద్యుని రూపం లో వచ్చాడని అర్థం. ‘భారతీయ వైద్యం ఆయుర్వేదం ‘ …………ఆయుర్ ‘ వేదం’ అని ఎందుకన్నారంటే వైద్యశాస్త్రం కూడా వేద శాస్త్రాలతో సమానమైన పవిత్రత గలది కాబట్టి. క్షీరసాగర మధనం జరిగినప్పుడు ‘ధన్వంతరి’ అనే పేరుగల్గిన నారాయణ స్వరూపుడు అమృతబాండం ఒకచేతిలోనూ ,ఆయుర్వేదశాస్త్రం ఒకచేతితోనూ ధరించి వచ్చాడు. తదనంతరకాలంలో అశ్వనీదేవతలు ఈ ఆయుర్వేదాన్ని బ్రహ్మదేవుని ద్వారా గ్రహించి దేవవైద్యులయ్యారు. భూలోకంలోని అనేక ఔషధ వృక్షాలకు సృష్టి కర్తలయ్యారు. 
వైద్యుడు చిన్నవాడైనా గౌరవించాలి. చిన్నకులం వాడైనా నారాయణ స్వరూపిణిగా భావించి నమస్కరించాలి. మనకు ఇష్టమున్నా ,లేకపోయినా వైద్యుని సలహాలనూ, సూచనలనూ ఆచరించి తీరవలసిందే. ప్రతి గ్రామానికి దేవాలయం లేకున్నా పరవాలేదుగానీ వైద్యాలయం మాత్రం వుండి తీరాలి. సమస్త ధర్మసాధనాలలోకి శరీర రక్షణే ముఖ్యమైనదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటేనే జీవితంలో దేనినైనా సాధించగలడు. ఏ సుఖాన్ని అయినా అనుభవించగలడు.

కోట్లాది రూపాయలున్నవాడు శ్రీమంతుడు కాదు. మంచి ఆరోగ్యం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఇటువంటి ఆరోగ్యాన్ని సమకూర్చి ఇచ్చేవాడు దైవస్వరూపుడే గదా! అందుకే” వైద్యో నారాయణో హరి:” అంటారు ప్రతి వృత్తీ దేనికదేీ సాటి, వైద్య వృత్తి ఎంతో భిన్నమైనది. మృత్యువు అంచులదాకా వెళ్లిన వారికి ప్రాణం పొసే శక్తి ఈ వృత్తికి ఉంటుంది. అందుకే వైద్య వృత్తి పవిత్రమైనది. తమ వ్యకిగత జీవితాన్ని వదిలేసి తెల్లకోటుకే ప్రాధాన్యమిస్తుంటారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి తపన పడేవాడే నిజ మైన వైద్యుడు. మానవ సేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవానిరతి కలిగి ఉంటే అంతటి గొప్ప వ్యక్తిగా గుర్తింపు, డాక్టర్లకు సహనం,ఓర్పు ,సేవానిరతి, దయ ఉండాలి. అప్పుడే ఈవృత్తిలో రాణించగలుగుతారు.

శుశృతుడు ఆయుర్వేదానికి చెందిన ఒక శస్త్ర చికిత్సకుడు,అధ్యాపకుడు. క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన శుశృతుడు, వారణాసిలో జన్మించాడు. ఇతని ప్రసిద్ధ గ్రంథంశుశృతుడు సంహిత వైదిక సంస్కృతంలో వ్రాయబడింది. ఈ శుశృత సంహిత లో వ్యాధులు వాటి నివారణోపాయాలు విపులంగా వ్రాయబడినవి. ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి శుశృతుడు గుండెకాయవంటివాడు. ప్రపంచంలోని యితర దేశాలు కళ్ళుతెరవక ముందే భారతదేశంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఎందరి ప్రాణాలనో కాపాడిన అపర ధన్వంతరి శుశృతుడు.
క్రీ .పూ.600 ప్రాంతాలకు చెందింవవాడుగా చరిత్రకారులు శుశృతుణ్ణీ భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పురాణేతిహాసాల ప్రకారం శుశృతుడు 5 వేల ఏళ్ళ కంటే పూర్వంవాడే! ఉత్తర భారత దేశాంలోని గంగానదీ తీరాన వెలసిన వారణాసి పట్టణం శుశృతుడి నివాస స్థానం. శుశృతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు, కాశీరాజైన ధన్వంతరి శిష్యుడు. శుశృతుడి జీవితకాలం గూర్చి భిన్న భిన్న అంచనాలు ఉన్నాయి. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు జాన్ విల్సన్ సుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల నడుమ జీవించి ఉండవచ్చని అంచనా వేశాడు. వారణాసిలో ధన్వంతరి మహర్షి వద్ద వైద్యశాస్త్రంఅభ్యసించినట్టు చరిత్రకారులు పేర్కొన్నారు.

నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన శస్త్ర చికిత్స వైద్య నిపుణుల ఫోటోలతో సహా , వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య శుశృతునిది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొన్నారు.


వైద్యుల రుణం తీర్చుకొవడానికి….


అనుక్షణం ఆరోగ్యాన్ని,శరీరక, మానసిక స్థయిర్యాన్ని అందించే ఈ వైద్య నారాయణులకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? డాక్టర్‌ చికిత్స చేసే శాడు-రోగి ఫీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణం తీరిపోతుందా? ఆ బంధం తెగి పోతుందా? ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణం కృతజ్ఞతను నింపుకునే పదేపదే గుర్తు చేస్తూ ఉండరూ ?…అందుకే ఈ వైద్యులకు కోసం ప్రపంచమంతా ఒక రోజు కేటాయించింది.. అదే ప్రపంచ డాక్టర్స్‌ డే . వాళ్లను గుర్తు పెట్టు కునేం దుకు ఈ రోజున డాక్టర్లందరూ సుఖ సంతో షాలు, ఆయురోగ్యాలు, సిరి సంపదలతో చల్లగా ఉండాలని దేవుని ప్రార్థించి శుభాకాంక్షలు తెలియ జేస్తారు. అలా తెలియజేసేందుకు సంవత్సరంలో ఓ రోజు కేటాయించారు.   


డాక్టర్స్‌ డే మొదలైందిలా..  


1993 మార్చి 30న జార్జియలోని విండార్‌ లో తొలిసారిగా డాక్టర్స్‌ డే పాటించారు. డా. చార్లెస్‌ బి. ఆల్మండ్‌ భార్య బ్రౌన్‌ ఆల్మండ్‌ వైద్యుల గౌరవార్ధం ఒక రోజు కేటాయించాలని నిర్ణ యించారు. గ్రీటింగ్‌ కార్డులను పంపడం, అసు వులు బాసిన వైద్యులకు పూలతో నివాళ్పుల ర్పిం చడం ద్వారా తొలి డాక్టర్స్‌ డే ఉత్సవం జరిపారు. జాతీయ డాక్టర్స్‌ డే నాడు ఎర్రని కార్నేషన్‌ పువ్వు లను సాధారణంగా వాడేవారు. యునైటెడ్‌ స్టేట్స్‌ లో ప్రతినిధుల సభ డాక్టర్స్‌ డే పాటిస్తూ 1958 మార్చి 30 వ తేదీన చేసింది.
1990లో నేషనల్‌ డాక్టర్స్‌ డే పాటించాల్సిందిగా చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1990 అక్టోబర్‌ 30న అధ్యక్షుడు జార్జిబుష్‌ మార్చి 30న ‘నేషనల్‌ డాక్టర్స్‌ డే’ గా పేర్కొంటూ చట్టం పై సంతకం చేశారు. మన దేశంలో ప్రతియేటా జూలై 1న నేషనల్‌ డే ని జరుపుకుంటున్నాం. ప్రముఖ వైద్యు డు డా. బీసీ రాయ్‌ గౌరవవార్థం ఈ రోజు న నిర్ణ యించారు. ఈయన 1882 జూలై 1 న జన్మిం చారు. మన దేశంలొ వైద్య రంగా నికి ఎనలేని సేవలందించిన బీసీ రాయ్‌ గౌర వర్థాం ఆయన జన్మ దినాన్ని డాక్టర్స్‌ డే పాటిస్తున్నారు. డాక్టర్‌ బీసీ రాయ్‌ పుట్టినరోజు ..మరణించిన రోజు ఒక్క రోజు .. జూలై ఒకటో తేదీ కావడం విశేషం. ఆయన 1962 జూలై ఒకటో తేదీన చనిపొయారు . 
డాక్టర్స్‌ బి.సి. రాయ్‌ 1882 జూలై ఒకటవ తేదీన బీహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లాలోని బకిమ్‌ లో జన్మించారు. ఈయన పూర్తిపేరు బిధాన చంద్ర రాయ్‌. తండ్రి ప్రకాశ్‌ చంద్ర.ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌. బీసీ రాయ్‌ తోబుట్టు వులు ఐదుగురు తన 14 వ యేట తల్లిని కొల్పో యారు. అవివాహితుడైన బీసీ రాయ్‌ తన ఆస్తు లతో పాట్నాలో ఓ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సామాజిక సేవలకు అంకితం చేశారు. 
బీసీ రాయ్‌ 1909-11 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ లోని సెంట్‌ బెర్త్‌ లో ఎమ్మార్సీపీ, ఎఫ్ ఆర్సీ  డిగ్రీలు పొందడానికి చదువు కొన సాగించి 1911లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కోలోకతా మెడికల్‌లో కొంతకాలం అధ్యా పకుడిగా పనిచేశారు. ఈయన జాదవ్‌పూర్‌ టీబీ హాస్పిటల్‌ , ఆర్జీ ఖార్‌ మెడికల్‌ కాలజీ ,కమలా నెహ్రూ హాస్పిటల్‌ ,విక్టోరియా ఇన్‌స్టిట్యూట్‌ , చిత్త రంజన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ మొదలైన సంస్థలు నెలకొల్పాడు. 1926లో ప్రత్యేకంగా మహిళల కోసం, పిల్లల చిత్తరంజన్‌ సేవా సదన్‌ అనే వైద్య శాలను ఏర్పాటు చేశారు. మహిళలకు నర్సింగ్‌ శిక్షణ కోసం ఒక శిక్షణా సంస్థమా ఏర్పాటు చేశాడు.
1925లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బారక్‌ పూర్‌ అసెంబ్లీ నియెజక వర్గం నుంచి పోటీ చేసి గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ బెంగాల్‌ గా పేరొందిన సురేంద్రనాథ్‌ బెనర్జీని ఓడిం చారు.1922-28 మధ్యకాలం కోల్‌కతా మెడి కల్‌ జర్నల్‌కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వ ర్తించారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులుగా నియామకమయ్యారు. 1993 లో కోల్‌కత్తా నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 1942 లొ కొల్‌కత్తా విశ్వ విద్యాయానికి వైస్‌ చాన్స్‌లర్‌గా, 1943లో మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.  
విద్యా,వైద్య రంగాల్లో ఈయన సేవలకు 1944లో గౌరవ డాక్టకేట్‌కు ప్రదానం చేశారు. 1948 జన వరి 13న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1961లో ఫిబ్రవరి 4న ఆయన్ను భారతరత్నపురస్కారం తో సత్కరించారు. వీరి జయంతి రోజైన జూలై ఒక టినే వర్ధంతి. ఈయన స్మారకార్థం ప్రతీ ఏటా జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1962లో ప్రకటించింది .వివిధ రంగా ల్లో సేవలు అందించిన వారికి 1976 నుంచి డాక్టర్‌ బీసీ రాయ్‌ పేరిట అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నేటి వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఆదర్శ ప్రాయుడు డాక్టర్‌ బీసీ రాయ్‌.