365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, ఫిబ్రవరి 2, 2025: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ ఛాంపియన్‌లు, క్లినిషియన్‌లు, సంరక్షకుల కోసం ప్రత్యేకంగా పికిల్‌బాల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ‘యునైటెడ్ బై యూనిక్’ అనే అంతర్జాతీయ నేపథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. క్యాన్సర్‌పై పోరాడి విజయం సాధించిన వారిలో ఐక్యతా భావాన్ని పెంపొందించడంతో పాటు, వారి విజయాలను సెలబ్రేట్ చేయడమే దీని లక్ష్యంగా ఉంది.
ఈ టోర్నమెంట్‌లో 30 మంది పైగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్యాన్సర్ ఛాంపియన్‌లతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు. పికిల్‌బాల్ ఆట శారీరక ఆరోగ్యంతో పాటు, భావోద్వేగ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది. టోర్నమెంట్‌తో పాటు, క్యాన్సర్ చికిత్స తర్వాత చురుకైన జీవనశైలి పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వెల్‌నెస్ వర్క్‌షాప్‌లు, మానసిక ఆరోగ్యంపై స్పెషల్ సెషన్‌లు కూడా నిర్వహించారు.
ఇది కూడా చదవండి..ఫిబ్రవరి19 నుంచి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ.. ప్రోమోనుషేర్ చేసిన స్పోర్ట్స్ స్టార్..
ఇది కూడా చదవండి..ETO మోటార్స్, ఫ్లిక్స్‌బస్ భాగస్వామ్యం – విద్యుత్ బస్సుల ప్రారంభం
ఇది కూడా చదవండి..హీరో ఈశ్వర్ ‘సూర్యాపేట్ జంక్షన్’ ట్రైలర్ విడుదల
ఈ సందర్భంగా హెచ్‌సిజి క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తెర్లి యువ కిశోర్ మాట్లాడు తూ, “క్యాన్సర్ ఛాంపియన్‌లతో పాటు, వారి కుటుంబ సభ్యులు, డాక్టర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ టోర్నమెంట్ క్యాన్సర్‌పై పోరాడుతున్నవారిలో సమాజంతో మమేకమయ్యే భావనను పెంచేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు పెద్దపాళ్ల ఉపకరిస్తుంది” అని పేర్కొన్నారు.
క్యాన్సర్ ఛాంపియన్‌లు, క్లినిషియన్‌లు, సంరక్షకులు తమ అనుభవాలను పంచు కోవడంతో పాటు, ఈ ప్రత్యేక టోర్నమెంట్ ఐక్యత, ఆదరాభిమానాలకు నిదర్శనంగా నిలిచింది. కమ్యూనిటీ కనెక్షన్‌లను పెంపొందించి, క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ చేస్తున్న ఈ ప్రయత్నం సమాజానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.