365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 9,2025: ప్రముఖ రిటైల్ చైన్ ‘నేషనల్ మార్ట్ – ఇండియా కా హైపర్‌మార్ట్’ నిర్వహించిన ఫెస్టివల్ ధమాకా లక్కీ డ్రా గ్రాండ్ ఫినాలే సోమవారం నాగారం స్టోర్‌లో ఘనంగా జరిగింది. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు నెలరోజులపాటు సాగిన ఈ ప్రత్యేక డ్రాలో మొత్తం 222 బహుమతులు లక్కీ వినియోగదారులకు లభించాయి.
Read this also…National Mart Concludes Festive Dhamaka Lucky Draw with Grand Celebration at Nagaram Store
ఇది కూడా చదవండి…38వ జాతీయ క్రీడలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు ఉత్తరాఖండ్ క్రీడాశాఖ కొత్త మలుపు
ఈ కార్యక్రమంలో ముఖ్యాకర్షణగా మెగా బహుమతిగా ఒక సరికొత్త కారు గెలుచుకున్న విజేతను ప్రకటించడంతో సందడి పెరిగింది. అదనంగా 13 మందికి డబుల్ డోర్ ఫ్రిజ్‌లు, 13 మందికి ఎయిర్ కూలర్లు, ఇంకా 195 మందికి డిన్నర్ సెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమం పండుగల సందర్బంగా వినియోగదారులకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చింది.

నేషనల్ మార్ట్ వ్యవస్థాపకుడు యష్ అగర్వాల్ మాట్లాడుతూ –
“మా వినియోగదారుల సంతోషమే మా విజయానికి మూలాధారం. ‘ఫెస్టివల్ ధమాకా’ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేశాం. ఈ స్థాయిలో స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఉత్సాహపూరితమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తాం” అని చెప్పారు.
Read this also…Karungali Mala 10 Amazing Benefits.
ఇది కూడా చదవండి…నేచురల్ స్టార్ నానితో ఆశీర్వాద్ మసాలాల ‘దమ్’ క్యాంపెయిన్
ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 13 నేషనల్ మార్ట్ స్టోర్లలో నిర్వహించారు. ప్రతి స్టోర్ వద్ద కూడా వినియోగదారులకు భాగస్వామ్యంగా ఉండే అవకాశం లభించడంతో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
విజేతలందరికీ నేషనల్ మార్ట్ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈ ప్రచారాన్ని విజయవంతం చేసిన ప్రతివారికి కృతజ్ఞతలు తెలిపింది.