365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, వారణాసి, ఏప్రిల్ 11,2025: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి 50వ సారి భేటీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ. 3,884 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

ఈ పర్యటనలో మోదీ ఉదయం 10 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి నేరుగా మెహ్దీగంజ్ గ్రామ పంచాయతీకి వెళతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, ఎన్‌హెచ్-31పై భారీ అండర్‌పాస్ టన్నెల్, విమానాశ్రయ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాల, హాకీ స్టేడియం, రామ్‌నగర్ పోలీస్ లైన్‌లో బ్యారక్‌లు, రోడ్డు విస్తరణ, మరువాడిలో ఫ్లైఓవర్ వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

అలాగే, మోహన్‌సరాయ్‌లో రూ. 12 కోట్లతో ట్రాన్స్‌పోర్ట్ సిటీ నిర్మాణం, ట్రక్ పార్కింగ్, వేర్‌హౌస్, రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, డార్మిటరీ సౌకర్యాలతో పాటు సీసీటీవీ నిఘా, భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి…దానిమ్మను కట్ చేయకుండా తీయ్యగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి…ట్రంప్ కీలక ప్రకటన: 90 రోజులపాటు సుంకాలపై విరామం

వారణాసిలోని 11 ప్రముఖ పార్కుల సౌందర్యీకరణ, 35 కొత్త ఆర్ట్‌వర్క్‌ల ఏర్పాటు, జల్ జీవన్ మిషన్‌లో భాగంగా రూ. 345 కోట్లతో 130 గ్రామీణ తాగునీటి పథకాలు, విద్యా రంగంలో కొత్త కళాశాలలు, గ్రంథాలయాల నిర్మాణం వంటివి కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగం.

అంతేకాకుండా, ఆయుష్మాన్ వయ వందన కార్డులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) సర్టిఫికెట్లు, బనాస్ డైరీకి సంబంధించిన రూ. 105 కోట్ల బోనస్‌లను కూడా మోదী పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. 50 వేల మందికి పైగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని బీజేపీ కాశీ జోన్ అధ్యక్షుడు దిలీప్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అధికారులు పేర్కొన్నారు.