365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 10, 2025: దానిమ్మ… రుచిలోనూ, ఆరోగ్యంలోనూ అద్భుతమైన ఈ పండు అందరికీ ఇష్టమే. కానీ, మార్కెట్‌లో కొన్న దానిమ్మ తీపిగా ఉంటుందా..? లేదా పుల్లగా ఉంటుందా అనే ఆందోళన చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కట్ చేయకుండా, రుచి చూడకుండానే తీపిని తెలుసుకునే 4 సులభమైన ట్రిక్స్ గురించి తెలుసుకుందాం.
బరువును పరిశీలించండి..
దానిమ్మ బరువుగా ఉంటే అందులో రసం ఎక్కువగా ఉంటుందని, అంటే అది తీపిగా ఉండే అవకాశం ఎక్కువ. తేలికగా ఉంటే రసం తక్కువగా ఉండి, పులుపు ఎక్కువగా ఉండొచ్చు.
రంగును గమనించండి..
ఇది కూడా చదవండి…ట్రంప్ కీలక ప్రకటన: 90 రోజులపాటు సుంకాలపై విరామం
ఇది కూడా చదవండి…అల్లు అర్జున్ ‘AA22’ పోస్టర్‌పై వివాదం: ‘డ్యూన్’ నుంచి కాపీనా?
ఎరుపు లేదా గులాబీ రంగులో ఉన్న దానిమ్మలు సాధారణంగా తీపిగా ఉంటాయి. లేత రంగు లేదా పసుపు ఛాయ ఉంటే అవి పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది.

ఆకారం చూడండి..
గుండ్రంగా కాకుండా కొద్దిగా చతురస్రాకారంలో ఉండే దానిమ్మలు ఎక్కువగా పండి, తీపిగా ఉంటాయి. గుండ్రని ఆకారం ఉంటే అవి పూర్తిగా పండకపోయి ఉండొచ్చు.
Read this also…‘Zee Telugu Unveils Drama Juniors Season 8 with a Star-Studded Grand Launch
ఇది కూడా చదవండి…డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్‌కు రెడీ
తట్టితే శబ్దం వినండి..
దానిమ్మను తేలికగా తట్టితే లోహ శబ్దం లాంటి ధ్వని వస్తే అది రసంతో నిండి, తీపిగా ఉన్నట్లు అర్థం. మృదువైన శబ్దం వస్తే అది పాడైనట్లు లేదా తీపి తక్కువగా ఉన్నట్లు సంకేతం.
ఈ నాలుగు ట్రిక్స్‌తో ఇకపై దానిమ్మ కొనేటప్పుడు ఆలోచించాల్సిన పనిలేదు. తీపి దానిమ్మను సులభంగా ఎంచుకుని, రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి!.