365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 26,హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని రైతులకు సాధికారత కల్పన దిశగా సరికొత్త పథకాని తీసుకొచ్చింది .
ఈ పథకం ముఖ్యాంశాలు
దేశంలోని సన్న, చిన్నకారు రైతులందరికీ వర్తించే స్వచ్ఛంద-భాగస్వామ్య పింఛన్ పథకమిది. ఇందులో 18-40 ఏళ్ల మధ్య వయస్కులు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైనవారికి 60 ఏళ్లు పూర్తికాగానే నెలకు రూ.3000 వంతున పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు… అర్హుడైన రైతు లబ్ధిదారు 29 ఏళ్లు నిండిన తర్వాత ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున తన వాటాకింద జమచేయాల్సి ఉంటుంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అంతే మొత్తాన్ని పింఛన్ నిధికి జమచేస్తుంది. లబ్ధిదారుకు 60 ఏళ్లు పూర్తయ్యాక పెన్షన్ అందుకుంటున్న కాలంలో మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ మొత్తంలో 50 శాతం (రూ.1,500) కుటుంబ పింఛన్ కింద అందుతుంది. అయితే, సదరు జీవిత భాగస్వామి ఇదే పథకంలో చందాదారు అయి ఉండరాదు. ఒకవేళ లబ్ధిదారు తనవంతు నెలవారీ చందాలు చెల్లిస్తూ 60 ఏళ్లు రాకముందే మరణించినట్లయితే- వారి జీవిత భాగస్వామి ఆ మొత్తాన్ని చెల్లించడంద్వారా పథకంలో కొనసాగవచ్చు.
పథకాల మధ్య సమన్వయం-రైతులకు సౌభాగ్యం:-
ఈ పథకంలో ఆసక్తికర అంశమేమిటంటే- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద పొందే ఆర్థిక సహాయం నుంచి రైతులు నేరుగా తమ స్వచ్ఛంద-భాగస్వామ్య పింఛన్ పథకానికి నెలవారీ చందా చెల్లించే వీలుండమే. ఇందుకోసం రైతులు MeitY కిందగల సార్వత్రిక సేవా కేంద్రాలలో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ప్రధాన వాగ్దానాల అమలు-వ్యవసాయ రంగానికి సాధికారత:-
స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత కూడా రైతుల కోసం ఇలాంటి పథకం అవసరం గురించి ఆలోచన చేసిన దాఖలాల్లేవు. అయితే, 2019 లోక్‘సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం గురించి తొలిసారి ప్రస్తావించాక క్రమేణా ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. అలాగే బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనూ ఇటువంటి పథకంపై హామీ ఇచ్చింది. తదనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మంత్రిమండలి సమావేశంలోనే అది కార్యరూపం దాల్చింది.
నెలకు రూ.100
ప్రధానమంత్రి రైతు పింఛన్ పథకం కింద నెలకు రూ.100 రైతులు తమ వంతుగా జమచేయాల్సి ఉంటుందని, దీంతో వారికి 60 ఏండ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛన్ అందుతుందని కేంద్రం స్పష్టం చేసిం ది. ఎల్ఐసీ నిర్వహించే ఈ పింఛన్ ఫండ్లో కేంద్రం కూడా రూ.100 తనవంతుగా జమచేస్తుందన్నది. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం ప్రత్యేక పింఛన్ పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి మూడేండ్లలో 5 కోట్ల మంది రైతులకు లబ్ధిచేకూర్చేందుకు ప్రభుత్వంపై ఏడాదికి రూ.10,774 కోట్ల భారం పడనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం అన్ని రాష్ర్టాల వ్యవసాయ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకం కోసం 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులైన రైతుల వివరాలు నమో దు చేయాలన్నారు. ఈ పథకం పట్ల రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.