Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 24,2024: రాజకీయ జీవితం తొలినాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలు స్వయంగా ముందుండి నడిపించిన ఆడారి కిషోర్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ కనీస గుర్తింపు గౌరవం కూడా ఇవ్వలేదు.

పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో..

అయినప్పటికీ ఎన్నో సందర్భాలుగా ద్వితీయ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇదే అభిప్రాయం బహిరంగంగా ఆయనతో చెబుతున్నప్పటికీ చంద్రబాబు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో ఆడారి కిషోర్ కుమార్ ఎటువంటి పదవులు ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీకి ఎంతో పని చేశారు.

దాదాపు పద్నాలుగు లక్షల జనాభా కలిగిన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కాపులతో పాటు, వెలమ, గవర సామాజిక వర్గాల ఓటర్లు 75 శాతానికి పైగా ఉంటాయి. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి.

అనూహ్య పరిణామాల మధ్య..

అయితే అనూహ్య పరిణామాల మధ్య.. తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశావహులుగా ఉన్న ఆడారి కిషోర్ కుమార్ స్వయంగా సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్కిల్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వయంగా వైజాగ్ విమానాశ్రయం రన్వే పైనే ఆందోళన చేసినందుకు ఆయనపై కేంద్ర సాయుధ బలగాల అధికారులు కేసులు కూడా పెట్టారు. నారా లోకేష్ యువగళం యాత్రకు కూడా.. ఆడారి కిషోర్ కుమార్ తన శక్తికి మించి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఆయనకు ఇస్తారని స్పష్టమైన సమాచారం అందడంతో.. ఎన్నో ఏళ్లుగా తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం వాళ్ల కోరిక మేరకు అడారి కిషోర్ కుమార్ వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ భీసెట్టి సత్యవతి ఆ సమయంలో వచ్చిన జగన్ వేవ్ ద్వారా మాత్రమే గెలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనకాపల్లి పార్లమెంటు..

ఇన్ని ఏళ్లలో.. గ్రౌండ్ లెవెల్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడంలో విఫలం అవడంతో… ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆడారి కిషోర్ కుమార్ రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడు. మరో రెండు మూడు రోజుల్లో అనకాపల్లి పార్లమెంటు సీటు అడారి కిషోర్ కుమార్ కు ప్రకటించే అవకాశం ఉంది.

కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో..

స్వతహాగా సీఎం జగన్ కి తగ్గట్లుగా అడారి కిషోర్ కుమార్ కూడా.. దూకుడుగా వ్యవహరించే నేత. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. సామాజిక సమీకరణలతో పాటు ప్రజల్లో ఎంతగానో మంచి పేరు ఉంది. కాబట్టి కొన్ని రోజుల్లో అడారి కిషోర్ కుమార్ కు టికెట్ ప్రకటించే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతంలో అభిమానులు, కార్యకర్తలు భావిస్త్యున్నారు.

ఇది కూడా చదవండి: సుజుకి ఫ్రాన్స్‌లో స్విఫ్ట్ 2024 కొత్త వీడియో ప్రకటన విడుదల..

Also read : DCB Bank announces Full Year FY 2024 Results

Also read : Indus Appstore Launches the Voice Search Feature in 10 Indian Languages..

ఇది కూడా చదవండి: HDFC Bank Educated over 2 Lakhs Citizens on Safe Digital Banking Practices PAN India in FY24..

ఇది కూడా చదవండి: మానవ శక్తి సామర్థ్యాలను సాక్షాత్కరింప చేసిన వ్యక్తి కమలాకర్

ఇది కూడా చదవండి: ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం..

error: Content is protected !!