ఆందోళనలో అవ్వా, తాతలు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే1, 2024: అవ్వా బాగున్నావా..? తాతా బాగున్నావా..? అని పలకరించి నెల పింఛను అందించే వాలంటీర్ రాలేదు. ఫస్ట్ తారీఖు మాత్రం వచ్చింది. రాగానే పలకరిస్తూ చేతిలో పింఛను పెడితే ఆ డబ్బుతో మందులు.. ఉప్పు, పప్పు..చింతపండు వంటి సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను.. వాలంటీర్ రాలేదు. చేతిలోకి పైసలు పడలేదు. ఈ ఎండల్లో ఆటోల్లో పక్కూరు వెళ్లి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవాలట. ఈ మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రలవల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం ..ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి.
ఈ పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా..? అనేది సందేహమే..? అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వీళ్ళ ఖాతాల్లో జమ అయిన మూడు వేలలో కొంత కోత విధిస్తే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు పింఛనుదారులు.
ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని ఆయన భరించలేక … సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని బాబు సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని జనాలు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మే5 తేదీన శిల్పకళా వేదికలో దర్శకరత్నడి.ఎన్.ఆర్. ఫిల్మ్అ వార్డ్స్ వేడుకలు..
ఇది కూడా చదవండి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుతారు..?
ఇది కూడా చదవండి: వరల్డ్ లేబర్ డే 2024 ప్రత్యేకత..?
ఇది కూడా చదవండి: పార్టిసిపేటింగ్ ప్రోడక్టులపై అత్యధిక బోనస్ ప్రకటించిన బజాజ్ అలయంజ్ లైఫ్..
Also read:Bajaj Allianz Life Announces its highest-ever bonus for their participating products
ఇది కూడా చదవండి: కరెరా సమ్మర్ కలెక్షన్ విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..