Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,మే 7,2024: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా శ్రీ అమిత్ పైఠాంకర్‌ (Amit Paithankar) నియమితులైనట్లు వారీ ఎనర్జీస్ లిమిటెడ్ వెల్లడించింది. వృద్ధి, నవకల్పనలు, పర్యావరణ అనుకూల విధానాల్లో ఆయనకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.

పునరుత్పాదక ఇంధన రంగంలో కంపెనీని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు సీఈవో హోదాలో ఆయన కృషి చేయనున్నారు.

వారీలో చేరడానికి ముందు, ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో పైఠాంకర్ సౌత్ ఏషియా మేనేజింగ్ డైరెక్టరుగాను, ఇతరత్రా హోదాల్లోనూ విధులు నిర్వర్తించారు. విద్యార్హతల విషయానికొస్తే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయడంతో పాటు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశారు.

“సౌర విద్యుత్ పరిశ్రమ ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో గణనీయంగా వృద్ధి సాధించేందుకు ప్రస్తుతం చక్కని అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరిశ్రమకు వారీ ఎనర్జీస్ ఎంతగానో తోడ్పాటు అందిస్తోంది.

పర్యావరణ అనుకూలమైన ఇంధనాలను అందించాలన్న కంపెనీ లక్ష్య సాధనలో అర్థవంతమైన పాత్ర పోషించనుండటంపై ఆసక్తిగా ఉన్నాను” అని ఈ సందర్భంగా వారీ ఎనర్జీస్ సీఈవో అమిత్ పైఠాంకర్ తెలిపారు.

స్థిరమైన వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణల దిశగా కంపెనీకి సారథ్యం వహించనున్న శ్రీ పైఠాంకర్ నియామకాన్ని వారీ కుటుంబం స్వాగతిస్తోంది.

Also read: Waaree Energies Ltd. Appoints Mr. Amit Paithankar as the Chief Executive Officer

ఇది కూడా చదవండి:సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని ఈసీని కోరిన చంద్రబాబు

Also read: Lupin Q4 FY2024 Results

ఇది కూడా చదవండి:ఎల్లోమీడియా కుట్రలో పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ట్వీట్ వెనువెంటనే దిద్దుబాటు…