Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 2, 2024: ప్రముఖ స్పోర్ట్స్ సర్వీస్ ప్రొవైడర్ గేమ్ పాయింట్ తన కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఐదో ఎడిష‌న్‌ను 2024 ఫిబ్రవరి 3 నుంచి 4 వరకు హైదరాబాద్‌లోని హైక్వాలిటీ స్పోర్ట్స్ సెంటర్లో నిర్వహించనుంది.

కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అనేది గేమ్ పాయింట్ వారి కార్య‌క్ర‌మం. ఇది కార్పొరేట్ ప్రపంచంలోని ఉద్యోగులలో క్రీడల వ‌ల్ల క‌లిగే ప్రయోజనాలను ప్రోత్సహించడం, పొందుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వారికి మెరుగైన శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సును క‌లిగిస్తుంది. ఇంకా, ఉద్యోగులలో మెరుగైన టీమ్ వర్క్ ను ప్రోత్సహిస్తుంది.

ఈ సంద‌ర్భంగా గేమ్ పాయింట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ, “కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఐదో ఎడిషన్ కోసం కార్పొరేట్ నిపుణులను ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది.

ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు, పోటీ పడేందుకు ఎదురుచూస్తున్న కార్పొరేట్ ఉద్యోగులకు ఇప్పుడు ఓ మైలురాయిగా మారింది. కొన్నేళ్లుగా ఈ టోర్నమెంట్ కార్పొరేట్ ప్రపంచంలో శారీరక శ్రేయస్సు, టీమ్ వర్క్ ను ఏకీకృతం చేసే దిశగా కీలక అడుగు వేసింది.

స్పోర్ట్స్, ఫిట్‌నెస్‌కు విలువనిచ్చే సంస్కృతిని సృష్టించడానికి గేమ్ పాయింట్ అంకిత‌మైంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ దాని ప్రాధాన్యం గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుందని మేము ఆశిస్తున్నాము.

మన అత్యాధునిక బ్యాడ్మింట‌న్ కోర్టుల‌లో కొన్ని అతిపెద్ద కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు ఆడే ఉత్తేజకరమైన బ్యాడ్మింటన్ ఆట‌ను చూడటానికి మేము ఎదురుచూస్తున్నాము” అన్నారు.

కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 7 వ్యక్తిగత ఈవెంట్లతో పాటు ప్రత్యేకమైన టీమ్ ఈవెంట్ ఫార్మాట్లో ఉంటుంది. టీమ్ ఈవెంట్‌లో జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో, గోల్డ్‌మ‌న్ శాక్స్, ఇన్ఫోసిస్, నోవార్టిస్ ఇండియా లిమిటెడ్, కోల్రూయిట్ గ్రూప్, ఫిన్ఎంకేటీ, సామ్రాట్ గ్రూప్‌ల‌తో పాటు గత ఏడాది విజేత ఆప్టమ్ సహా మొత్తం 8 కంపెనీలు పాల్గొంటాయి.

పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, 35+ పురుషుల సింగిల్స్, 35+ పురుషుల డబుల్స్ సహా ఏడు వ్యక్తిగత ఈవెంట్లలో 100 మందికి పైగా పాల్గొంటారు.

టోర్నమెంట్ లోని ప్రతి ఆటను 30 పాయింట్లతో కూడిన ఒక‌టే గేమ్ ద్వారా నిర్ణయిస్తారు.

“గేమ్ పాయింట్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్రీడలలో పాల్గొనడం మా ఉద్యోగులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా టీమ్ వర్క్ ను బలోపేతం చేస్తుంది.

ఉత్సాహభరితమైన పోటీ కోసం, మా ప్రొఫెషనల్స్ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించే అవకాశం కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని నోవార్టిస్ కు చెందిన పార్టిసిపెంట్ దీపక్ దీక్షిత్ అన్నారు.

ఒక్కో జ‌ట్టులో న‌లుగురి నుంచి ఆరుగురు ష‌ట్ల‌ర్లు ఉంటారు. వారిలో క‌నీసం ఒక‌రు మ‌హిళ అయి ఉండాలి. వాళ్ల‌ను గ్రూపులుగా ఏర్ప‌రిచి, రౌండ్ రాబిన్ లీగ్‌లో ఆడిస్తారు. గ్రూప్ ద‌శ అయిన త‌ర్వాత రెండు వేర్వేరు నాకౌట్ ద‌శ‌లు ఉంటాయి. అవి ఛాంపియ‌న్స్ క‌ప్, ఛాలెంజ‌ర్స్ క‌ప్.

“వ్యక్తిగత శ్రేయస్సును పెంపొందించడానికి, బలమైన, సంఘటిత జట్లను నిర్మించడానికి క్రీడల శక్తిని ఆప్టమ్ ఉద్యోగుల‌మైన మేము విశ్వసిస్తాము. కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ప్రతి ఎడిషన్ లో మేము పాల్గొన్నాము.

ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహించే మా నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది. టోర్నమెంట్ లో పాల్గొనడమే కాకుండా, గెలవాలని కూడా మేము ఆత్రుతగా ఉన్నాము” అని ఆప్ట‌మ్‌కు చెందిన శ్రీ‌నాధ్ నందికోళ్ల ఉత్సాహంగా చెప్పారు.

ప్ర‌తి గ్రూపులోనూ మొద‌టిస్థానంలో నిలిచిన జ‌ట్టు ఛాంపియ‌న్స్ క‌ప్పు ఆడేందుకు క్వాలిఫై అవుతుంది. రెండో స్థానంలో నిలిచిన జ‌ట్లు ఛాలెంజ‌ర్స్ క‌ప్ ఆడ‌తాయి. రెండింటిలోనూ సెమీఫైన‌ల్స్, ఫైనల్స్ త‌ర్వాత తుది విజేత‌ల‌ను నిర్ణ‌యిస్తారు.

సెమీఫైన‌ల్స్ ఆదివారం జ‌రుగుతాయి. వాటి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ఈ కింది లింకులో ఉంటుంది: https://sportvot.com/event/EVENT_65ba1b5524aa9a0001eafc39