Thu. Nov 7th, 2024
Captain Harvest range of quality, affordable food items only available at Udon
Captain Harvest range of quality, affordable food items only available at Udon

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌, జూన్‌ 21,2021:భారతదేశంలో అతిపెద్ద బిజినెస్‌ టు బిజినెస్‌ (బీ2బీ) ఈ కామర్స్‌ వేదిక ఉడాన్‌ నేడు అసంఘటిత రంగంలోని భారీ ఆహార ఉత్పత్తుల మార్కెట్‌లో కెప్టెన్‌ హార్వెస్ట్‌ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కెప్టెన్‌ హార్వెస్ట్‌ బ్రాండ్‌ నాణ్యమైన, సరసమైన ధరలలోని ఆటా, మైదా, గోధుమలు, బియ్యం, శెనగపిండి తదితర ఉత్పత్తులు ప్రత్యేకంగా ఉడాన్‌ వేదికపై లభ్యం కానున్నాయి.ఈ సందర్భంగా ఉడాన్‌ హెడ్‌– ఫుడ్‌ బిజినెస్‌ , వివేక్‌ గుప్తా మాట్లాడుతూ ‘‘కిరాణా స్టోర్లు నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నాణ్యమైన, సరసమైన ధరలలో ఉత్పత్తులను అసంఘటిత రంగంలోని మార్కెట్‌లలో పొందలేకపోవడం.

ఈ ఫలితంగా స్థానిక రిటైలర్లు విక్రేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీనికి తోడు లభ్యతననుసరించి ధరలు కూడా హెచ్చుతగ్గుదలకు లోనవుతుంటాయి. ఈ సమస్యలకు కెప్టెన్‌ హార్వెస్ట్‌ తగిన పరిష్కారం చూపగలదు. అత్యున్నత నాణ్యతకలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలలో అందిస్తుంది. అంతేకాదు, రైతులు, చిన్న మిల్లర్లు సైతం ఈ–కామర్స్‌ వ్యాప్తి ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు…’’ అని అన్నారు.రైతుల నుంచి నేరుగా సేకరించడంతో పాటుగా అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్యాకింగ్‌ చేస్తోన్న కెప్టెన్‌ హార్వెస్ట్‌ శ్రేణి ఆహారోత్పత్తులు బహుళ ఎస్‌కెయులలో లభిస్తున్నాయి. ఈ బ్రాండ్‌ తొలుత 40 నగరాలు, పట్టణాలలో లభ్యం కానుంది. అనంతర కాలంలో ఇతర పట్టణాలకు వ్యాప్తి చెందనుంది.

Captain Harvest range of quality, affordable food items only available at Udon
Captain Harvest range of quality, affordable food items only available at Udon

·అసంఘటిత రంగంలోని భారీ ఆహారపదార్థాల మార్కెట్‌లో నాణ్యత, పరిమాణం, లభ్యత పరంగా కిరాణా స్టోర్లు, వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు జాతీయ స్థాయి మధ్యవర్తిత్వం

·నూరు శాతం బరువుకు హామీ ఇవ్వడంతో పాటుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలతో సరసమైన ధరలలో నాణ్యతకు భరోసా

·రైతులు, మిల్లర్లనుంచి స్థానికంగా కొనుగోలు చేయడంతో పాటుగా అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో ప్రాసెస్‌, ప్యాకేజింగ్‌

·ఈ–కామర్స్‌ అందించే వ్యాప్తి కారణంగా ప్రతక్ష్యంగా ప్రయోజనం పొందనున్న మిల్లర్లు, రైతులు

error: Content is protected !!