365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10, 2025: మా ప్రియతమ బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడు అని మెగాస్టర్ చిరంజీవి ట్విట్టర్(ఎక్స్) వేదికగా తెలిపారు. ఆయన మార్క్ శంకర్ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం అందించారు. మార్క్ శంకర్ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది.

మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయ, కృపతో త్వరలోనే మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ఎప్పటిలాగే సాధారణ జీవితానికి తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

ఇది కూడా చదవండి…ఉప్పల్ స్టేడియంలో మరింత బలోపేతంగా జియో నెట్వర్క్

Read this also…Jio Delivers Unmatched 5G Experience at Uppal Stadium for the Ongoing Cricket Season

రేపు హనుమత్ జయంతి సందర్భంగా, ఆ స్వామి ఒక పెద్ద ప్రమాదం నుంచి, విషాదం నుంచి మా పసిబిడ్డను కాపాడి, మాకు అండగా నిలిచాడు. ఈ క్లిష్ట సమయంలో వివిధ ఊళ్లు, ప్రాంతాల నుంచి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి సంఘీభావం తెలిపి, ప్రార్థనలు చేస్తూ, ఆశీస్సులు అందజేస్తున్నారు.

https://twitter.com/KChiruTweets/status/1910322949019619460

ఇది కూడా చదవండి…దానిమ్మను కట్ చేయకుండా తీయ్యగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి…ట్రంప్ కీలక ప్రకటన: 90 రోజులపాటు సుంకాలపై విరామం

నా తరపున, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.