Thu. Feb 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఎర్రుపాలెం,డిసెంబర్ 31,2023: జమలాపురంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క కు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి జమలాపురం వెంకటేశ్వర స్వామి సేవకుఆలయ అర్చకులు ఉప్పల విజయ దేవశర్మ, ఉప్పల మురళీమోహన్ శర్మ, రాజీవ్ శర్మ, వెంకటేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం ఆలయంలోని మహా మండపంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఆశీర్వచనం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రుపాలెం మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్, జమలాపురం పెద్ద చెరువు,పేట చెరువు, ఎన్ ఎస్ పి మూడో జోన్ మార్పు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలోనే నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. వేద పండితులు రామదాసు విజయకృష్ణ,వెంపటి అభిలాష్ శర్మ,స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు, లడ్డు, ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, ఆలయ చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఆలయ ఈవో కొత్తూరు జగన్ మోహన్ రావు, మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, కడియం శ్రీనివాసరావు, ఇస్మాయిల్, మల్లెల లక్ష్మణరావు, మహిళా అధ్యక్షురాలు గంట తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు.