Fri. Nov 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే1, 2024: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడ లోని శ్రీజ ఆసుపత్రిని నిర్వహి స్తున్నారు. ఆయన తన కుటుంబంతో కలిసి గురునానక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత, శ్రీనివాస్ ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

మంగళవారం ఉదయం పది గంటల తర్వాత ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఇంట్లో వారిని చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ నగరంలో శ్రీజ ఆర్థోపెడిక్ ఆస్పత్రిని నిర్వహించారు.

శ్రీనివాస్ కుటుంబ సభ్యుల గొంతు కోసి హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. ఇంట్లోని గదుల్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆర్థిక సమస్యలతో ఆస్పత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సిపి రామకృష్ణ పరిశీలించారు. డాగ్స్కాడ్, క్లూస్ టీం తనిఖీలు నిర్వహించాయి. కాగా, తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదిరింటి వాళ్ల పోస్ట్బాక్స్ డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఓ లెటర్ లభ్యమైంది. దీంతో ఇది ఒక ఆత్మహత్య కేసు

అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్థరాత్రి సమయంలో కుటుంబసభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తు న్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీనివాస్ ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆసుపత్రిని బెజవాడలో ప్రారంభించాడు.

ఆ ఆసుపత్రి సరిగా నడవడం లేదు. దీంతో ఆయన డిప్రెషన్లో వెళ్లారు. ఈ క్రమంలో ఆసుపత్రిని రెండు నెలల క్రితం మరొకరికి అప్పగించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, శ్రీనివాస్ చాలా సౌమ్యుడని, ఎవరితోనూ విభేదాలు లేవని, సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేశాడు.

కొంతకాలం హాస్పిటల్ సజా వుగానే నిర్వహించినప్పటికీ అనంతరం హాస్పిటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యా యని శ్రీనివాస్ స్నేహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదరు హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నారన్నారు. కేవలం శ్రీని వాస్ ఆర్థిక ఇబ్బందుల వల్లనే చనిపోయి ఉంటాడని భావిస్తున్నామని, తల్లిని, భార్యను, పిల్లలను హత్య చేశాడంటే నమ్మకలేకపోతున్నామని అంటున్నారు.

ఇది కూడా చదవండి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుతారు..?

ఇది కూడా చదవండి: వరల్డ్ లేబర్ డే 2024 ప్రత్యేకత..?

ఇది కూడా చదవండి: పార్టిసిపేటింగ్ ప్రోడక్టులపై అత్యధిక బోనస్ ప్రకటించిన బజాజ్ అలయంజ్ లైఫ్..

Also read:Bajaj Allianz Life Announces its highest-ever bonus for their participating products

ఇది కూడా చదవండి: కరెరా సమ్మర్ కలెక్షన్‌ విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..

Also read: PAT CUMMINS, THE BRAND AMBASSADOR OF CARRERA & CAPTAIN OF SUNRISERS HYDERABAD LAUNCHED A NEW SUMMER COLLECTION

Also read: Freedom Healthy Cooking Oils and Election Commission join hands for Voter Participation Drive for Lok Sabha Elections 2024

Also read: Mahindra launches the XUV 3XO – the ‘New Disruptor’in compact SUVsPrices start at₹7.49 Lakh..

Also read: PAT CUMMINS, BRAND AMBASSADOR OF CARRERA UNVEILSTHE SUMMER 2024 COLLECTION AT HELVETICA EYEWEAR BOUTIQUE, HYDERABAD

Also read: Lifestyle launches Carrera Eyewear with Pat Cummins at its Begumpet store in Hyderabad

error: Content is protected !!