365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 3,2025: పాత లే ఔట్లను చెరిపేసి, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన పార్కులు, రహదారులను కబ్జా చేస్తున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 1980-1990 మధ్య ఏర్పాటు చేసిన లే ఔట్లను పూర్తిగా మాయం చేసి, భూమిని తమ అధీనంలోకి తీసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి…సైన్స్ ఫిక్షన్ నుంచి వాస్తవ ప్రపంచానికి.. స్మార్ట్‌ఫోన్ నుంచి వీడియో కాలింగ్ వరకూ!
ఇది కూడా చదవండి…ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: 20 శాతం ఓట్లకు పైగా చెల్లనివి
Read this also...MLC Polls Vote Counting: 20% Invalid Votes Create Major Concern
సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు అందగా, వీటిలో ఎక్కువగా నగర శివార్లలోని లే ఔట్లకు సంబంధించినవి ఉన్నాయి. భూముల ధరలు పెరగడంతో గతంలో తమకు అమ్మినవారే కొన్నిచోట్ల కబ్జాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు.

అంతేకాకుండా, పంచాయతీ లే ఔట్లను వ్యవసాయ భూములుగా మార్చి సాగుచేసుకుంటున్నారని కూడా ఫిర్యాదులొచ్చాయి. హైడ్రా అధికారులు ఈ అంశాలను పరిశీలిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.