365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 20,2025: మీ వాహనం ఏ ఇంధనంతో నడుస్తుందో ఇకపై స్పష్టంగా చూపించాల్సిందే. వాహనంపై ఉపయోగించే ఇంధనాన్ని తెలియజేసే కలర్ కోడెడ్ స్టిక్కర్‌ను విండ్‌షీల్డ్‌పై అతికించాల్సిందే ఈ మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..రాత్రిపూట కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్‌లను అభివృద్ధి చేసిన స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తలు
Read this also…Stanford Scientists Develop Solar Panels That Generate Power Even at Night
PUCCకి స్టిక్కర్ తప్పనిసరి:
జనవరి 27న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన ఎం.సీ. మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా, కలర్-కోడెడ్ స్టిక్కర్ లేకుండా వాహనానికి కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUCC) ఇవ్వరాదని కేంద్ర రవాణా శాఖ స్పష్టం చేసింది.

ఇంధన రకానుబట్టి స్టికర్లు:
వాహనానికి ఉపయోగించే ఇంధనాన్ని బట్టి స్టికర్లు వేర్వేరుగా ఉంటాయి. వీటిని హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు (HSRP) జారీ సమయంలోనే అందిస్తారు. అయితే కాలక్రమేణా స్టికర్లు పాడవ్వడం లేదా వాహనంలో మార్పుల వల్ల తొలగిపోతే, వాటిని తిరిగి పొందే వెసులుబాటు కూడా ఉంది. కానీ ఇందుకు యజమానుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి...2025 మెగా డీఎస్సీ షెడ్యూల్ పూర్తీ వివరాలు ..
ఇది కూడా చదవండి...2025 మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 16,347 పోస్టుల భర్తీకి సన్నాహాలు
“ఇప్పటికే HSRP కోసం డబ్బులు చెల్లించాం. ఇప్పుడు స్టిక్కర్ కోసం మరోసారి డబ్బు వసూలు చేయడం అన్యాయం” అంటూ వాహన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ entire ప్రక్రియను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.