Thu. Feb 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైద‌రాబాద్, జ‌న‌వ‌రి 21, 2024: హైదరాబాద్ బ్లూక్రాస్ ఆధ్వర్యంలో దోమలగూడలోని చైతన్య విద్యాలయంలో #ల‌వ్ మై ఇండీ డాగ్ షో రెండో ఎడిషన్ ను నిర్వహించారు.

వీధికుక్క‌ల ఉత్స‌వంగా చేసుకునే ఈ శక్తివంతమైన కార్యక్రమంలో, అనేక వీధికుక్క‌లు, వాటిని పెంచుకునేవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది జంతు సంక్షేమం విష‌యంలో హైదరాబాద్‌కు దీర్ఘకాలికంగా ఉన్న‌ నిబద్ధతను, మన భారతీయుల జీవితాల్లో భాగమైన ఈ విభిన్నమైన కుక్కలను ప్రదర్శిస్తుంది.

ల‌వ్ మై ఇండీ డాగ్ షోలో ‘యంగ్/ వైజ్ ఇండీ, గ్రేట్ ఇండీ’ లాంటి కేటగిరీలు ఉన్నాయి. ఇది వివిధ వయస్సులు, పరిమాణాలలో ఉన్న ఇండీ కుక్కలను గుర్తించడానికి ఒక వేదికను అందిస్తుంది.

ప్రతి కేటగిరీలో విజేతలకు మార్స్ పెట్‌కేర్‌ వారి ఆధ్వ‌ర్యంలో వాటి విభిన్న‌మైన వ్య‌క్తిత్వాలు, ల‌క్ష‌ణాల‌ను గురించి తెలియ‌జేస్తూ స‌ర్టిఫికెట్లు, స్పెష‌ల్ పెడిగ్రీ హాంప‌ర్లు అందజేశారు.

డాక్టర్ లక్ష్మీ రమణ, డాక్టర్ శుభమ్ వైద్, హైదరాబాద్ బ్లూక్రాస్ ప్రెసిడెంట్ అపర్ణారావు, డాగ్ బిహేవియర్ స్పెషలిస్ట్ వినోద్ పొయిలాత్, మీటెమ్ కొన్నోలీ, శ్రేయా పరోపాకరి వంటి ప్రముఖ న్యాయనిర్ణేతల ప్యానెల్ కుక్కల ప్రవర్తన, స్నేహం ఆధారంగా అంచనా వేసి, ఇండీస్‌కు అంతర్లీనంగా ఉండే అందం, వైవిధ్యాన్ని ప్రశంసించింది.

ఈ కార్యక్రమం కేవ‌లం పోటీ మాత్ర‌మే కాదు.. ఇంకా ఎక్కువ; ఇది ఇండీ డాగ్ కమ్యూనిటీ వేడుక. బ్లూక్రాస్, మార్స్ పెట్ కేర్ ఫోటో బూత్ ఒక ప్రధాన ఆకర్షణ. ఇందులో మంచి మంచి ప్రోప్స్, సృజ‌నాత్మ‌క బ్యాక్ గ్రౌండ్‌లు ఉన్నాయి.

కుక్క‌ల‌ను పెంచుకునేవారు, వారి పెంపుడు కుక్క‌ల మ‌ధ్య ఉన్న చిరస్మరణీయ క్షణాలను బంధించడానికి సరైన స్థలాన్ని ఇది అందిస్తుంది. ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ పాల్గొనేవారిలో సంతోషకరమైన, క‌మ్యూనిటీతో కూడిన‌ వాతావరణాన్ని పెంపొందించింది.

ఈ కార్య‌క్ర‌మంలో బ్లూక్రాస్ హైద‌రాబాద్ వ్య‌వ‌స్థాప‌కురాలు, ఛైర్‌ప‌ర్స‌న్ అమ‌ల అక్కినేని త‌న ఉత్సాహాన్ని పంచుకుంటూ ఇలా చెప్పారు. “#ల‌వ్ మై ఇండీ డాగ్ షో అనేది కేవ‌లం ఒక కార్య‌క్ర‌మ‌మే కాదు. ఇండీ కుక్క‌లకు ఉండే అపార‌మైన శ‌క్తిసామ‌ర్థ్యాలు, నిబ‌ద్ధ‌త‌ను పండుగ‌లా జ‌రుపుకునే ఉద్య‌మం. మార్స్ పెట్ కేర్ తో మా సహకారం దీనిని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ వేదిక ఈ అద్భుతమైన జంతువులను గౌరవించడమే కాకుండా, పెంపుడు జంతువులు, వాటిని పెంచుకునే కుటుంబాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించాల‌న్న‌ మా లక్ష్యాన్ని మ‌రింత బలోపేతం చేస్తుంది” అని ఆమె తెలిపారు.

మార్స్ పెట్కేర్ ఇండియా సేల్స్ డైరెక్టర్ నితిన్ జైన్ మాట్లాడుతూ, "ఈ ప్రదర్శనను నిర్వహించి, పెంపుడు జంతువులకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించాలనే మా ఉద్దేశ్యంతో ఈ ప్రదర్శనను నిర్వహించి, ప్రదర్శనలో భాగస్వాములు కావడానికి వీలు కల్పించినందుకు హైదరాబాద్కు చెందిన బ్లూ క్రాస్ ను నేను అభినందింస్తున్నాను." అని అన్నారు.