Sat. Jul 27th, 2024
HTC_DPS_365

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 16, 2023: కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం దార్శనికతతో కూడుకున్నదని, ఇది భారత విద్యావ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ సొసైటీ కోశాధికారి నమితా ప్రధాన్ అన్నారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మెటామార్ఫోసిస్ ఆధ్వర్యంలో జరుగుతున్న హైదరాబాద్ టుడే కాన్క్లేవ్ (హెచ్‌టీసీ)లో ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ- విజన్ టు యాక్షన్’ అనే అంశంపై ఆమె కీలకోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం సమాజంతో ఎప్పుడూ ముడిపడి ఉంటాయని, సమాజం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం,విద్య తప్పనిసరిగా కావాలని చెప్పారు.

భారతదేశం విద్యలో అగ్రగామిగా ఉంది, కానీ కాలక్రమేణా విదేశీయుల దండయాత్రలు, వలసరాజ్యాల కారణంగా మన దేశం అప్పులపాలైందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం విద్యారంగంలో మంచి ప్రగతిని సాధించిందని, ముఖ్యగా 2016 నుంచి పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంద’’ని నమితా ప్రధాన్ పేర్కొన్నారు.

HTC_DPS_365

విద్యావ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన ప్రాముఖ్యతను గురించి చెబుతూ, ఉపాధ్యాయులు సబ్జెక్టులను గుర్తుంచుకోవడంపై దృష్టి పెట్టకుండా విద్యార్థులలో విశ్లేషణాత్మక నైపుణ్యాలు, పరిశోధన, చర్చా సామర్థ్యాలను పెంపొందించడానికి కృషి చేయాలన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత కీలకమైన సమయాల్లో కొత్త టెక్నాలజీల ద్వారా బోధనా తరగతులను అవలంబిస్తున్నందుకు టీచింగ్ ఫ్యాకల్టీని ఈ సందరర్భంగా నమితా ప్రధాన్ అభినందించారు. ‘‘భారతీయులు ఎలాంటి కొత్త సవాళ్లనైనా స్వీకరించగలరని ఈ అంశమే సూచిస్తుంద”ని ఆమె వివరించారు.

మహమ్మారి కాలంలో.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు వారి విద్యా విషయాలలో సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆమె అన్నారు. ఇంగ్లిషుకు సమాన ప్రాధాన్యం ఇస్తూనే మాతృభాషపై దృష్టి సారించారని ఆమె చెప్పారు.

హైదరాబాద్ టుడే కాంక్లేవ్ (హెచ్ టీసీ) మొదటి ఎడిషన్ ఏప్రిల్ 15, 16 తేదీలలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్, మెటామార్ఫోసిస్ సహకారంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ నిర్వహిస్తోంది.

ఇది USA (హార్వార్డ్ చికాగో), ఫిన్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నిపుణులతో పాటు విధాన నిర్ణేతలు, జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల సభ్యులను ‘‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 – విజన్ టు యాక్షన్’’పై చర్చకు తీసుకు వచ్చింది.

డీపీఎస్ అండ్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చైర్మన్ మల్కా కొమరయ్య, హైదరాబాద్ టుడే కాంక్లేవ్ హెచ్‌టీసీ కో-ఫౌండర్ మల్కా యశస్వి, డీపీఎస్ సీనియర్ ప్రిన్సిపాల్ సునీతరావు, ఇతర బ్రాంచీల ప్రిన్సిపాల్స్, టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.