365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10, 2025: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఉప్పల్‌లో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్‌వర్క్ ను స్టేడియం లోపల,బయటా బలోపేతం చేసింది.
మ్యాచ్ హైలైట్‌లు రికార్డ్ చేయడం నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు-స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆస్వాదించగలుగుతున్నారు.
Read this also…Jio Delivers Unmatched 5G Experience at Uppal Stadium for the Ongoing Cricket Season
ఇది కూడా చదవండి…దానిమ్మను కట్ చేయకుండా తీయ్యగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి…ట్రంప్ కీలక ప్రకటన: 90 రోజులపాటు సుంకాలపై విరామం
స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది.
జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP తో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్‌లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రయత్నం network congestion ను తగ్గించడమే కాకుండా, వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్ కూ వీలు కల్పిస్తుంది. ప్రత్యక్ష మ్యాచ్ అనుభవాన్ని అభిమానులు నిరవధికంగా ఇతరులతో పంచుకోగలుగుతున్నారు.
ఐసీసీ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా జియో ఒకే రోజులో 50 కోట్ల జీబీల డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా దాని నెట్‌వర్క్ సామర్థ్యాన్ని చాటింది. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సమయంలోనూ భారీ జనసాంద్రత మధ్య కూడా జియో 5జీ సేవలు నిరాటంకంగా అందించింది. Ookla నివేదిక ప్రకారం, జియో 201.87 Mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించి, ఇతర టెలికాం కంపెనీలను అధిగమించింది.
Read this also…‘Zee Telugu Unveils Drama Juniors Season 8 with a Star-Studded Grand Launch
దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ కోర్, క్లౌడ్ ఆర్కెస్ట్రేషన్, AI/ML ప్లాట్‌ఫామ్‌లు,క్లౌడ్ నేటివ్ పరిష్కారాలతో, జియో తన నెట్‌వర్క్ వ్యవస్థపై సంపూర్ణ నియంత్రణను కలిగి ఉంది. దీని వల్ల వినియోగదారులకు స్థిరమైన, విశ్వసనీయమైన, మరియు అధిక నాణ్యత కలిగిన 5జీ అనుభవాన్ని నిరంతరం అందించగలుగుతోంది.