Tue. Jul 9th, 2024

మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి, లయన్ ch.గోపాల కృష్ణ, బి.సరోజని రామారావు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఏప్రిల్ 24,2024: మానవ శక్తి సామర్థ్యాలను హిప్నాటిజం ద్వారా సాక్షాత్కరింప చేసిన వ్యక్తి కమలాకర్ అని జోనల్ చైర్ పర్సన్ లయన్ ch.గోపాల కృష్ణ, బి . సరోజని రామారావు అన్నారు.

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,నవభారత లయన్స్ క్లబ్ సహకారంతో డాక్టర్ హిప్నో కమలాకర్ జయంతి, వర్థంతి వేడుకలను ముషీరాబాద్ తెలంగాణ భవిత సెంటర్ (మానసిక వికలాంగుల పాఠశాల)లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.

యోగా గురు సరోజని రామారావు మాట్లాడుతూ కమలాకర్ ప్రణాళికబద్దమైన నడవడిక,సుదీర్ఘమైన ఆలోచన కల వ్యక్తిని తెలిపారు.

సాధించి చూపగలనన్న పట్టుదల
ఇవన్నీ కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు.

సైకాలజిస్ట్ జ్యోతి రాజా మాట్లాడుతూ సైకాలజీ రంగాన్ని అభివృద్ది దిశగా పరుగులు తీయించి ప్రత్యక్షంగా చూపించిన ఘనత ఆయనదన్నారు.

నేటి సైకాలజిస్ట్ లకు, యువతకు ఆయన ఆదర్శం మని తెలిపారు.

డా .హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ హిప్నాటిజం లో తనదైన ముద్రవేసిన వ్యక్తి న్నారు. పదిరోజుల కార్యక్రమాలకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిల్లలకు పజిల్స్ పుస్తకాలు, పోషకాహారం, మందులు 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి, జోన్ చైర్ పర్సన్ సి.హెచ్ . గోపాల్ కృష్ణ యోగా గురు బి.సరోజినీ రామారావు, లయన్ కృష్ణ వేణి, మణెమ్మ , సినియర్ లయన్ సి.వి. హరిహరన్, సైకాలజిస్ట్ జ్యోతి రాజా, భవిత సెంటర్ హెడ్ విజయ లక్ష్మి డా.హిప్నో పద్మా కమలాకర్ ఇవ్వడం జరిగింది.

ఇది కూడా చదవండి: ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం..

Also read : Reliance Jio is now the World’s Largest Mobile Operator in Data Traffic surpassing China Mobile.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ ఆస్తులు- అప్పులు ఇవే..

Also read : Reliance Jewels unveils Vindhya Collectionmarking Akshaya Tritiya Celebrations..