Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ,ఏప్రిల్ 23,2024: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు.

గత అయిదేళ్ళలో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114,76,78,300. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీకి రూ.26,84,70,000 చెల్లించారు.

పవన్ కళ్యాణ్ అప్పులు రూ.64,26,84,453 ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46 కోట్ల 70 లక్షలు ఉన్నాయి.

విరాళాలు..

పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు.

  • ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు
  • అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు
  • అప్పులు రూ.64.26 కోట్లు
    వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళాలు అందచేశారు. ఆ వివరాలివి.. కేంద్రీయ సైనిక్ బోర్డు – రూ.1 కోటి . పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు . తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు.
    శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717.
    పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు.

ఇది కూడా చదవండి: గోల్డెన్ జూబిలీ సందర్భంగా విశిష్టమైన లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించిన స్వరాజ్

Also read : Swaraj Unveils Exquisite Limited-Edition Tractor to Commemorate its Golden Jubilee.

Also read :HDFC Mutual Fund Launches HDFC Manufacturing Fund

Also read : Reliance Jio is now the World’s Largest Mobile Operator in Data Traffic surpassing China Mobile.

ఇది కూడా చదవండి: డేటా ట్రాఫిక్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా జియో..

ఇది కూడా చదవండి: తగ్గిన OnePlus 5G స్మార్ట్‌ఫోన్ ధర..

ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ కళ.