Mon. Sep 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జనవరి 12,2024: ప్రముఖ నృత్య గురువు దివంగత పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం జ్ఞాపకార్థం అభినయవాణి నృత్యనికేతన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా రవీంద్రభారతిలో వెంపటి నాట్య మేధా కార్యక్రమం మంగళవారంతో ముగిసింది.

ఈ సందర్భంగా ప్రముఖ నృత్యగురువు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రామలింగశాస్త్రీ మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయం, నృత్యం వారసత్వం వేడుక అని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులకు శిక్షణను ఇస్తూ ఈ వేడుకను కాపాడుతున్న నృత్య గురువు బాలాత్రిపుర సుందరి కృషి అభినందనీయ మన్నారు.

అంతకు ముందు క్షీరసాగర మదనం అనే నృత్యరూపకాన్ని ప్రదర్శిం చారు. హెచ్.సీ.యూ ప్రొఫెసర్ టి.అనురాధ, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు శారద దేవి, కీర్తి రెడ్డి, గౌడియం స్కూల్ వ్యవస్థాపకు రాలు, సంస్థ వ్యవస్థాపకు రాలు బాలాత్రిపురసుందరి, అభినయవాణి నృత్యనికేతన్, సంస్థ వ్యవస్థాపకు రాలు పాల్గొన్నారు.

error: Content is protected !!