Tue. May 21st, 2024
ltte-prabhakaran_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, చెన్నై,ఫిబ్రవరి 13, 2023: తమిళ జాతీయ నాయకుడు ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నానని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పజా నెడుమారన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తమిళ నాయకుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టిటిఇ) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

తమిళ జాతీయ నాయకుడు ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, ఆయన క్షేమంగా ఉన్నారని, తెలియజేసేందుకు సంతోషిస్తున్నట్లు ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పజా నెడుమారన్ తెలిపారు.

ltte-prabhakaran_365

త్వరలో సరైన సమయం వచ్చినప్పుడు ప్రభాకరన్ ప్రపంచం ముందుకు వస్తారని ఆయన అన్నారు.ఎల్‌టీటీఈ చీఫ్‌పై సాగుతున్న ఊహాగానాలపై ఈ వార్తతోనైనా తెరపడుతుందని ఆశిస్తున్నాను అని నెడుమారన్ అన్నారు.

త్వరలో తమిళ జాతి విముక్తి కోసం ఒక ప్రణాళికను ప్రకటించబోతున్నాడని , ప్రపంచంలోని తమిళ ప్రజలంతా ఏకమై ఆయనకు అండగా నిలవాలని ఆయన కోరారు.

2009లో ప్రభాకరన్‌ హత్యకు గురయ్యారు..

ltte-prabhakaran_365

2009సంవత్సరంలో మే21 వతేదీన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE ) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక సైన్యం ఉరితీసింది.

దీంతో శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతం ఎల్టీటీఈ ఉగ్రదాడి నుంచి విముక్తి పొందింది. ప్రభాకరన్ చంపిన తర్వాత, LTTE లొంగిపోతున్నట్లు ప్రకటించింది.