365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే1, 2024: కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటనతో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంతా భయబ్రాంతులకు గురవుతున్నారు.
ప్రశ్న: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనలో రక్తం గడ్డ కట్టిందా లేదా? ఏదైనా సమస్యలు ఉన్నాయా అన్నది ఎలా తెలుసుకోవచ్చు..?
జవాబు: వ్యాక్సిన్ వల్ల వచ్చే క్లాట్స్‌ను ప్లేట్‌లెట్లను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషి రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య ఆధారంగా దీనిపై నిర్ధారణకు రావొచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నపుడు ప్లేట్‌లెట్లు తగ్గితే ఆందోళన చెందవచ్చు. ప్లేట్‌లెట్లు తగ్గి రక్తం గడ్డ కడుతుంటే అది వ్యాక్సిన్ వల్ల కలిగిన దుష్ప్రభావంగా గుర్తించవచ్చు
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో సైడ్‌ఎఫెక్ట్స్ వస్తున్న మాట నిజమేనంటూ ఆస్ట్రాజెనికా కంపెనీ న్యాయస్థానంలో అంగీకరించింది. స్వయంగా కంపెనీనే కోర్టులో తమ కంపెనీలో తయారైన టీకాతో దుష్ప్రభావాలు ఉన్నాయని, ఇది తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్లు తగ్గడం వంటి సమస్యలను గుర్తించినట్టు తెలిపింది.
దీంతో ఇప్పుడు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. అయితే, కొవిషీల్డ్ గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని పలువురు డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే చాలని వారు చెప్తున్నారు.
ప్రశ్న: ఆస్ట్రాజెనికా టీకా తీసుకుంటే రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉన్నదా?
జవాబు: టీకా తీసుకుంటే రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉంటుంది. ఇదేమీ కొత్తగా వచ్చిందో, కొత్తగా చెప్తున్నదేమీ కాదు. దీని గురించి ఇంటర్నెట్‌లో కావాల్సినంత సమాచారం ఉన్నది. ఇలా వచ్చే సమస్యకు, రోగానికి ఒక పేరు కూడా ఉన్నది. దీన్ని ‘వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ త్రోంబోటిక్ త్రోంబోసైటోపేనియా’ అని అంటారు. ఇదేమీ రహస్యం కాదు
ప్రశ్న: కొవిషీల్డ్‌తో రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆస్ట్రాజెనికా దాచిపెట్టిందా?
జవాబు: ఇది సరికాదు. ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ గురించి క్షుణ్ణంగా వ్యాక్సిన్‌తో పాటే ఇచ్చే వివరణ కాగితంలో పొందుపరిచింది. దాన్ని చదివితే రక్తం గడ్డ కట్టడం గురించి ఉంటుంది. 2021 ఫిలిఫ్పిన్స్ ఎఫ్‌డీఏ రూపొందించిన వ్యాక్సిన్ మార్గదర్శకాలను వివరిస్తూ ఇచ్చిన వివరణ కాగితంలో ఇది ఉన్నది.
ప్రశ్న: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ ఇలా రక్తం గడ్డ కడుతుందా?
జవాబు: వ్యాక్సిన్ తీసుకున్న అందరికీ సమస్యలు వస్తాయన్నది అపోహ మాత్రమే. ప్రతీ పది లక్షల మందిలో ముగ్గురి నుంచి 15 మందికి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది. అంటే మన దేశంలో వంద కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకుంటే అతి తక్కువ మందికే వచ్చే ప్రమాదం ఉంటుంది
ప్రశ్న: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతకాలానికి సమస్య రావొచ్చు ?
జవాబు: వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత నాలుగు నుంచి 30 రోజుల్లో ఎప్పుడైనా శరీరంలో సమస్యను గుర్తించవచ్చు. రెండో డోసు తీసుకున్న తర్వాత సమస్యలు పెద్దగా రాకపోవచ్చు. చాలా అరుదుగా మాత్రమే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు వస్తాయి. మూడేండ్ల తర్వాత ఎలాంటి సమస్యలు రావు. నిశ్చింతగా ఉండొచ్చు
ప్రశ్న: వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి గుండెపోటు వస్తున్నదనే ప్రచారం నిజమేనా?
జవాబు: వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రావడం చాలా అరుదు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యలే వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న తర్వాతనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండో డోసు తర్వాత సమస్య రావడం చాలా అరుదు. అలాంటిది ఏండ్ల తర్వాత రాదు. అందులోనూ గుండెపోటు రాదు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారు వెంటనే మరణించడం అన్నది జరగదు
ప్రశ్న: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ రావొద్దంటే ఏం చేయాలి ?
జవాబు: ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించండి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోండి. వేళకు తినడం, నిద్రపోవడం ముఖ్యం. వ్యాయామం చేయండి. అంతేకాకుండా మనిషికి గుండెపోటు లేదా ఇతర సమస్యలకు ప్రధాన కారణం వ్యాక్సిన్ కాదు.. ధూమపానం..అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మే5 తేదీన శిల్పకళా వేదికలో దర్శకరత్నడి.ఎన్.ఆర్. ఫిల్మ్అ వార్డ్స్ వేడుకలు..
ఇది కూడా చదవండి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుతారు..?
ఇది కూడా చదవండి: వరల్డ్ లేబర్ డే 2024 ప్రత్యేకత..?
ఇది కూడా చదవండి: పార్టిసిపేటింగ్ ప్రోడక్టులపై అత్యధిక బోనస్ ప్రకటించిన బజాజ్ అలయంజ్ లైఫ్..
Also read:Bajaj Allianz Life Announces its highest-ever bonus for their participating products
ఇది కూడా చదవండి: కరెరా సమ్మర్ కలెక్షన్ విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..