365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే1,2024: ఫస్ట్ నుంచీ చంద్రబాబు తీరే అంత.. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ.. చెప్పిన హామీల విషయంలో చివరకు చేతిలో చిటికెడు దులిపేసి.. నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ అని తప్పించు కుంటారు.. కంచం నిండా పెట్టినట్లు ప్రచారం చేస్తారు.. గత ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు మండి పడుతున్నారు. ఇక ఇప్పుడు మ్యానిఫెస్టో విషయంలో కూడా అదే చేస్తారన్నది ప్రజలకు గుర్తుంది.. అందుకే అయన మ్యానిఫెస్టోను సైతం పెద్దగా పట్టించుకోకుండా.. ఓస్..ఇంతేనా అని పెదవివిరుస్తున్నారు.
ఇవ్వనిదానికి ఎన్ని చెబితే ఏమిలాభం అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది. ఇక ముఖ్యమైన పెన్షన్ విషయానికి వస్తే ఏప్రిల్ నుంచి పింఛన్ 4000 కి పెంచి ఏప్రిల్, మే,జూన్ 3 నెలల ఎరియర్స్ కలిపి (4000+1000+1000+1000= 7000) ఇస్తా అన్నాడు.
అంటే జులై 1st న 65 లక్షల మందికి 7000 చొప్పున పింఛన్ ఇవ్వాలి. అంటే జులైలో ఒక్క పింఛన్ కోసమే సుమారు రూ. 5000 కోట్లు కావాలి.
వాస్తవానికి..
2018 లో కేవలం 39 లక్షలకి మాత్రమే పించన్ అందేది. కానీ ప్రస్తుతం 65 లక్షల మందికి పైగా పింఛన్ ఇస్తున్నారు. అంటే ఫించన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు డబుల్ అయింది. 2018 అక్టోబర్ లో పింఛన్ కోసం నెలకి 400 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం.. ఫించన్ అమౌంట్ గనుక 4000కి పెంచితే నెలకు రూ. 3000 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది… ఇప్పటికే రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు అని చెబుతున్న చంద్రబాబు.. ఇప్పుడు అంత డబ్బు ఎలా సమకూరుస్తారు.
అమ్మఒడి / అమ్మకు వందనం..
ప్రస్తుతం సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ఇంటర్ వరకూ చదివే పిల్లలకు ఏటా రూ. 15000 అమ్మఒడి కింద అందజేస్తున్నారు. దీనికి ఏటా 44 . 50లక్షలమందికి రూ. 26067 కోట్లు అందజేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం పేరిట ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందికి ఏటా రూ. ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు. అలా ఇస్తే 65 లక్షలమందికి ఇవ్వాల్సి ఉంటుంది..దీనికి ఐదేళ్ళలో రూ. 52000 కోట్లు ఖర్చవుతుంది.. అంత బడ్జట్ ఉందా ? చంద్రబాబు ఈ పథకం నిజంగా అమలు చేస్తారా ?
చంద్రబాబు ఇచ్చే హామీలు అమలుకు ఏటా రూ. 121619 కోట్లు ఖర్చు అవుతుంది… నిజంగా అది అమలు సాధ్యమేనా? అయన మాట మీద నిలబడి ఇవన్నీ అమలు చేస్తారా ? ప్రజలారా ఆలోచించండి.
Also read: SHOTT India :The most upscale gaming and entertainment destination in India has relocated to Hyderabad
ఇది కూడా చదవండి: ఇన్నేళ్ల తర్వాత కొవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
ఇది కూడా చదవండి: మే5 తేదీన శిల్పకళా వేదికలో దర్శకరత్నడి.ఎన్.ఆర్. ఫిల్మ్అ వార్డ్స్ వేడుకలు..
ఇది కూడా చదవండి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎందుకు జరుపుతారు..?
ఇది కూడా చదవండి: వరల్డ్ లేబర్ డే 2024 ప్రత్యేకత..?
ఇది కూడా చదవండి: పార్టిసిపేటింగ్ ప్రోడక్టులపై అత్యధిక బోనస్ ప్రకటించిన బజాజ్ అలయంజ్ లైఫ్..
Also read:Bajaj Allianz Life Announces its highest-ever bonus for their participating products
ఇది కూడా చదవండి: కరెరా సమ్మర్ కలెక్షన్ విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్..