365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మే 6,2024:మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ చెరిపేసి..మళ్ళీ రాసేసి….. ఏదేదో చేద్దాం అనుకుని బొక్కబోర్లా పడ్డారు…
తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు…. అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ఇంకో రెండు పదాలు కలిపి మళ్ళీ పోస్ట్ చేసారు…
దీంతో కొందరు దానికి సమాధానంగా అసలు ఆ చట్టం అమల్లోకి రాకపోతే నీకెలా అన్యాయం జరుగుతుంది… అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో అయన సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయ్యారు…
ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా విన్నకోట గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన భూమికి సంబంధించి ఉన్న సమస్యమీద ఆయనకు అధికారులు వివరణ ఇచ్చారు.
ఆ భూమిలో పీవీ రమేష్ తో బాటు అయన సోదరులకు కూడా భాగం ఉందని, ఈ క్రమంలో భూమి మ్యుటేషన్ కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు వివరించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మ్యూటేషన్ కోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉండగా రమేష్ అవేమి చూపించకుండా దరఖాస్తు చేసారని..అందుకే ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తహసీల్దార్ తేల్చేసారు…
దీంతో అనవసరంగా ఎల్లో మీడియా ట్రాప్ లో పడి పరువుపోగొట్టున్నారని ఆయన్ను నెటిజన్స్ విమర్శిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇన్నోవా క్రిస్టా GX+ని కొత్త స్టాండర్డ్ గ్రేడ్‌గా పరిచయం చేసిన టొయోటా కిర్లోస్కర్ మోటర్
Also read: PhonePe presents assured cashback offer for Akshaya Tritiya, 2024
Also read: Rapido Offers Free Rides during General Elections 2024
Also read: American Brew Crafts on Growth Spree
ఇది కూడా చదవండి:అంతర్జాతీయ నో డైట్ డే మే 6న సందర్భంగాబాడీ షేమింగ్‌ను అంతం చేయడానికే నో డైట్ డే
ఇది కూడా చదవండి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ యూటర్న్.
ఇది కూడా చదవండి: స్విఫ్ట్ 2024ని మే 9న విడుదల చేస్తున్న మారుతి సుజుకి.