Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,6మే 2024:మంచి పని ఎవరు చేసినా.. మంచి పనే అంటుంది.. సమాజం.. కానీ పచ్చమీడియాకు విషయంలో అలా కాదు.. అందుకే అన్నారేమో.. పచ్చకామెర్లోడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందని.. ఇలాంటి సామెతలు పుట్టుకొచ్చిందే పచ్చమీడియా బ్యాచ్, చంద్రబాబు లాంటివాళ్లు వల్లనేమో..

వారికి నచ్చనివాళ్ళు ఏ పని చేసినా.. ఏమాత్రం ఆలోచించకుండా తూచ్… అంటూ అడ్డంగా కొట్టేయడం పచ్చమీడియాకు బాగా కొట్టిన పిండే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎల్లో మీడియాతోపాటు బాబు అండ్ కో అంతా ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు..

గతంలో ఇదే చట్టాన్ని సూపర్ డూపర్.. ఆహా.. ఓహో అంటూ తెగ గొప్పలు పోతూ.. జబ్బలు చరిచారు. ఇప్పుడేమో తూచ్.. అది ప్రజలను మోసం చేసే చట్టం.. అది ఏమాత్రం కరెక్ట్ కాదు.. అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు.

ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో అన్నదాతలకు మేలు జరుగుతుందని.. అలాంటి చట్టం దేశంలో గతంలో అస్సలు రానేలేదు… అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు, రైతులకు వారిభూములకు భద్రత కల్పించవచ్చంటూ తెలుగుదేశం శాసన సంభ్యుడు, పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని చెప్పాడు. ఇలాంటి చట్టం ఆంధ్రప్రదేశ్ లో కూడా రావాలని డిమాండ్ చేసారు.. అప్పుడు ఆయన మాటలకు టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు. ఇప్పుడేమో వ్యతిరేకిస్తున్నారు..

ఈనాడు డ్రామోజీ రావు తన మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం అద్భుతం అని చాలాకాలం ప్రచారం కూడా చేశాడు.. పెద్ద పెద్ద విశ్లేషకుల ద్వారా కూడా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పదని చెప్పించాడు.. ఇప్పుడేమో అది మోసం చేసే చట్టం అంటూ ఊదరగొడుతున్నారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గతంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని గురించి ఎంతో బాగా చెప్పారు. ఇప్పుడేమో ఆమె తన చెల్లెలి భర్త , మరిది అయిన చంద్రబాబు కోసం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారు. ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలైతే ప్రజలకు కలిగే మేలు గురించి డ్రామోజీరావుకు, చంద్రబాబుకు, పురంధేశ్వరికి తెలుసు.. అయినా సరే తెలుసు కానీ.. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడానికి ఆ ముగ్గురూ నడుంబిగించి, నిజాలను అబద్దాలుగా ప్రచారం చేస్తున్నారు. మరొక వారంరోజుల్లో జరిగే ఎన్నికల్లో ఏపీ ప్రజలు వారి ముగ్గురి కుర్చీలు మడతేసి ఇంటిబాట పట్టించడం ఖాయం..

ఇది కూడా చదవండి: స్విఫ్ట్ 2024ని మే 9న విడుదల చేస్తున్న మారుతి సుజుకి.

ఇది కూడా చదవండి: ఈ ఫోటో బ్యాగ్రౌండ్ తెలుసా..?

ఇది కూడా చదవండి: ప్రతి డ్యాన్స్‌లో ఆరోగ్య రహస్యాలున్నాయి..