Sun. Jun 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగుళూరు, 6 మే 2024: టొయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) ఈరోజు ఇన్నోవా క్రిస్టా శ్రేణి లో కొత్త గ్రేడ్, GX+ని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్ సెంట్రిసిటీపై కంపెనీ దృష్టితో ప్రేరణ పొందిన , ఈ కొత్త గ్రేడ్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది.

తద్వారా కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా అత్యుత్తమతను అందించడంలో టికెఎం,నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇన్నోవా క్రిస్టా శ్రేణి ని పునరుజ్జీవింపజేస్తూ, కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా GX+ గ్రేడ్ 14 అదనపు ఫీచర్‌లను కలిగి వుంది. ఇది అత్యంత ఆకర్షణీయంగా పనితీరు, సౌందర్య ఫీచర్లను మిళితం చేసి, మొత్తం డ్రైవింగ్ అనుభవాన్ని పెంచుతుంది.

ఇన్నోవా క్రిస్టా GX+ ప్రధాన ఆకర్షణలలో వెనుక కెమెరా, ఆటో-ఫోల్డ్ మిర్రర్స్, డివిఆర్ వంటి ఫంక్షనల్ ఫీచర్‌లు, అలాగే డైమండ్-కట్ అల్లాయ్‌లు, వుడెన్ ప్యానెల్‌లు, ప్రీమియం ఫాబ్రిక్ సీట్లు వంటి సౌందర్య పరంగా ఆకర్షణలు కలిగి ఉంటాయి.

7-,8-సీట్ల అవకాశాలలో అందించిన, GX+ గ్రేడ్ ఐదు ఉత్తేజకరమైన రంగులలో అందుబాటులో ఉంది. వీటిలో సూపర్ వైట్, ఆటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్-గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్,సిల్వర్ మెటాలిక్ వున్నాయి. ఇవి ప్రతి ఒక్కటి వాహనం, బహుముఖ పాలెట్‌కు ప్రత్యేక నైపుణ్యాన్ని జోడిస్తుంది.

ఈ కొత్త వాహన పరిచయం పై టొయోటా కిర్లోస్కర్ మోటర్, సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్, శ్రీ శబరి మనోహర్ మాట్లాడుతూ, “2005లో ఇన్నోవా బ్రాండ్ విడుదల అయినప్పటి నుంచి పరిశ్రమ లో బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం ద్వారా సెగ్మెంట్ లీడర్‌గా తిరుగులేని ఖ్యాతిని పొందింది.

నాణ్యత,నమ్మకానికి పర్యాయపదంగా, ఇన్నోవా తరతరాలుగా భారతీయుల విభిన్న మొబిలిటీ అవసరాలను తీర్చింది. ఇప్పటికీ అదే ఆకాంక్ష, విలువను కలిగి ఉంది. మా కస్టమర్-సెంట్రిక్ విధానానికి అనుగుణంగా, అభివృద్ధి చెందుతున్న కస్టమర్ ట్రెండ్‌ల ఆధారంగా బ్రాండ్‌ను సంబంధితంగా విభిన్న పనితీరు అవసరాలకు అనుగుణంగా ఉంచడమే టీకెఎం లో మా ప్రయత్నం” అని అన్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా GX+ గ్రేడ్ ఇన్నోవా క్రిస్టా ప్రస్తుత లైనప్‌ను పూర్తి చేస్తుంది. మెరుగుపరచబడిన ఫీచర్లు,బహుళ కార్యాచరణల ద్వారా మరింత విలువను అందించే విషయంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన ఫీచర్లు ఒక ముందడుగు. ఈ నూతన పరిచయం విస్తృతశ్రేణి లో కస్టమర్లని ఆకర్షిస్తుందని మేము విశ్వసిస్తున్నాము, తద్వారా భారతదేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ఎంపివి గా ఇన్నోవా వారసత్వాన్ని బలోపేతం చేస్తుంది.

కొత్త ఇన్నోవా క్రిస్టా GX+ గ్రేడ్, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండే రీతిలో పొడిగించిన వారంటీ & టొయోటా జెన్యూన్ యాక్సెసరీస్ వంటి విలువ-ఆధారిత సేవల శ్రేణితో అనుబంధించింది.

ఇతర ఎంపికలలో 7-సంవత్సరాల ఫైనాన్స్ పథకాలు, అతి తక్కువ ఈఎంఐ , వంటివి వున్నాయి. టొయోటా కొత్తగా ప్రవేశపెట్టిన 5-సంవత్సరాల కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, వారంటీ – 3 సంవత్సరాలు/1,00,000 కిమీ ప్రామాణిక వారంటీ, దీనిని నామమాత్రపు ధరతో 5 సంవత్సరాలు/2,20,000 కిమీ వరకు పొడిగించవచ్చు.

Also read: Embrace Prosperity and Elegance This Akshay Tritiya with ORRA’s Exquisite Diamond Jewellery Collection..

Also read:  PhonePe presents assured cashback offer for Akshaya Tritiya, 2024

Also read: Rapido Offers Free Rides during General Elections 2024

Also read: American Brew Crafts on Growth Spree

ఇది కూడా చదవండి:అంతర్జాతీయ నో డైట్ డే మే 6న సందర్భంగాబాడీ షేమింగ్‌ను అంతం చేయడానికే నో డైట్ డే

ఇది కూడా చదవండి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ యూటర్న్.

ఇది కూడా చదవండి: స్విఫ్ట్ 2024ని మే 9న విడుదల చేస్తున్న మారుతి సుజుకి.

ఇది కూడా చదవండి: ఈ ఫోటో బ్యాగ్రౌండ్ తెలుసా..?