Sat. Jul 27th, 2024
smart-classes

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి, అక్టోబర్ 19,2022: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో4వ తరగతి చదువుతున్న పిల్లల నుంచి 10వ తరగతి వరకూ అందరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళ్లాలంటూ ప్రాథమిక విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. స్మార్ట్ ఫోన్లలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేయనున్నారు. ఇక నుంచి విద్యార్థులకు ఈ కంటెంట్ ఆధారంగానే క్లాసెస్ నిర్వహించనున్నారు.

అందులో భాగంగానే బైజూస్ సంస్థ తో ఒప్పందం చేసుకున్నది ఏపీ సర్కారు. 4వ తరగతి నుంచి అందరికీ కంటెంట్ అందిస్తామని చెప్పినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు పిల్లలంతా ఫోన్లు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులదే ఆ బాధ్యత అని చెబుతున్నారు.

డిజిటల్ విద్యలో విషయంలో ప్రారంభంలో కొందరికి అర్థంకాకపోవచ్చు గానీ అది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న నిర్ణయం అని అధికారులు అంటున్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో అందరూ ఫోన్ వాడకానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

smart-classes

4వ తరగతి నుంచి అందరికీ కంటెంట్ అందిస్తామని బైజూస్ ఒప్పందం చేసుకున్న రోజే ప్రభుత్వం ప్రకటించిన మాట వాస్తవమే. అయితే స్మార్ట్ ఫోన్లు విద్యార్థులే తెచ్చుకోవాల్సి ఉంటుందనే మాట ఆ రోజు చెప్పలేదు.

ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాల విద్యార్థుల పరిస్థితి గురించి ప్రశ్నించగా ఇంటర్ నెట్ సదుపాయం కల్పించే బాధ్యత పాఠశాల విద్యాశాఖది కాదని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తామని ఓ అధికారి తెలిపారు.