365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్ , ఏప్రిల్ 28,2025: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 26) ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా తెలుగు ఫిలిం చాంబర్‌లో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులకు కంటి పరీక్షలు చేయించేందుకు ఈ క్యాంప్ ఏర్పాటు చేయబడింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో & యాక్టర్ ప్రియదర్శి, యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also read this…TFJA, Phoenix Foundation & Shankar Eye Hospital’s “Free Eye Screening Camp” Receives A Great Response

ఇది కూడా చదవండి…“చిరంజీవి: ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణలో తన విజయప్రయాణం, దృఢ సంకల్పం పై ఆలోచనలు”

హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవం లో భాగంగా ప్రియదర్శి,నాగ వంశీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వ మోహన్, TFJA ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది.

ఈ క్యాంప్‌లో ప్రియదర్శి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయన చూపు పర్ఫెక్ట్‌గా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ, “తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంప్‌లో భాగంగా హాజరైందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ క్యాంప్ నిర్వహిస్తున్న అసోసియేషన్ పెద్దలకు, ఫీనిక్స్ ఫౌండేషన్ అవినాష్ చుక్కపల్లికి, శంకర్ ఐ హాస్పిటల్ విశ్వ మోహన్ కి ధన్యవాదాలు. జర్నలిస్టుల ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకుంటున్న ఆ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు.

Also read this…Chandrababu Naidu Praises Chiranjeevi’s Rise in Telugu Cinema at Dr. Sharani’s Book Launch

Also read this…Get Ready for Laughter, Drama, and Twists: “Bromance” Streams Exclusively on Sony LIV from May 1st!

ఈ హెల్త్ క్యాంప్‌లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 100 మందికి పైగా జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యులు ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.