Wed. Jul 3rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 3,2024: చెస్ క్రీడలో విశ్వవిజేతలను భారత్ కు అందించడమే ఇండియన్ చెస్ మాస్టర్స్, ఏకగ్రా చెస్ అకాడమీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సోషల్ యాక్టివిస్ట్ అరుణ్ జూపల్లి అన్నారు.

ఈరోజు హైదరాబాద్ బేగంపేట్లోని ఇండియన్ చెస్ మాస్టర్స్ సెంటర్లో గ్రాండ్ మాస్టర్స్ కోచింగ్ క్యాంపును ప్రారంభిస్తూ ఆయన హైదరాబాద్ లో ఇలాంటి శిక్షణా శిబిరాలనునిర్వహిస్తూ పిల్లలకు, విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చి భవిష్యత్ తరాల గ్రాండ్ మాస్టర్లుగా వారిని రూపుదిద్దుతున్నారని చెప్పారు.

భారతీయులు కనిపెట్టిన చదరంగం క్రీడ ప్రపంచంలో తెలివైన ఆటగా ప్రసిద్ధికేక్కిందని చెస్ తో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని అరుణ్ జూపల్లి అన్నారు. పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకించి చెన్నయ్ నుంచి వచ్చిన 13వ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ దీపన్ చక్రవర్తి మాట్లాడుతూ..-చెస్ అన్ని వయసుల వారు ఆడే క్రీడా అని ఈ ఆట లో వారికి తగిన మెళ కువలు సూచనలు ఇస్తే వారు రానున్న రోజుల్లో మేటి క్రీడా కారులుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించే లా తీర్చి దిద్దడం తన ధ్యేయమని చెప్పారు.

ఇండియన్ చెస్ మాస్టార్స్ కోచ్ చైతన్య సురేష్ మాట్లాడుతూ..తమ దగ్గర శిక్షణ పొందిన పిల్లలు ” వివిధ కాటగిరిలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా జాతీయ స్థాయి చదరంగం పోటీలకు ఎంపికవుతున్నారని చెప్పారు. ఏకగ్రా చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ-గ్రాండ్ మాస్టర్ శిక్షణా శిబిరం ఈ రోజు నుంచి12వ తేదీ వరకు తమ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని అన్నారు.

ఇంతవరకూ తెలంగాణ మొత్తంలో ఎక్కడా గ్రాండ్ మాస్టర్ శిక్షణా శిబిరం నిర్వహించలేద ని మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని గ్రాండ్ మాస్టర్ దీపాన్ చక్రవర్తి చెన్నయ్ తర్వాత ఇక్కడే శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని గ్రాండ్ మాస్టార్లుగా ఎదగాలని ఆకాక్షించారు.

హైదరాబాద్ క్రీడాకారులు గ్రాండ్ మాస్టార్లుగా ఎదగడానికి ఇది అద్భుత అవకాశమని, ఇక్కడ వున్న పిల్లలు చెస్ లో వరల్డ్ చాంపియన్షిప్ సాధించాలని యువనటుడు మహమ్మద్ సోహేల్ అన్నారు. యువ చెస్ క్రీడాకారిణి అన్య రంగినేని మాట్లాడుతూ.. తాము ఎదగడానికి ఇక్కడి కోచ్ లు తమ సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్రవంతి గుమ్మడి, తదితరులతో పాటు చిన్నారుల తల్లితండ్రులు పాల్గోన్నారు.

ఇది కూడా చదవండి: ఓటర్లకు ఖమ్మం శ్రీరక్ష ఆసుపత్రి బంపర్ ఆఫర్..

Also read: Axis Mutual Fund Launches ‘Axis Nifty Bank Index Fund’

Also read: Reliance Retail’s Tira Beauty Unveils New Private Label Brand: ‘Nails Our Way’

ఇది కూడా చదవండి: అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి సమర్థవంతమైన ఆయుర్వేద పరిష్కారాలు.

Also read: Reliance Consumer Products Limited Launches Inspiring Campaign for Campa Cola: Celebrating the Spirit of Resilience in New India

Also read: AVEVA Highlights India’s Digital Transformation with Opening of New Hyderabad Customer Experience Center

ఇది కూడా చదవండి:  ఏంది బాబూ..? : మండుటెండల్లో బ్యాంకుల వద్ద అవ్వా, తాతల తీవ్ర ఇబ్బందులు..

Also read: Mahindra’s Farm Equipment Sector Sells 35805 Units in India during April 2024.

Also read: A Higher Power: The First-Ever All-Electric BMW i5 M60 xDrive launched in India.

Also read: Dive into a World of Diverse Entertainment with discovery+, now on Tata Play Binge..