Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,మే 9, 2024 : ఫ్రాంక్‌ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి మహోన్నత వైభవాన్ని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైన వేడుకలో ఒకచోట చేరడంతో , తెలుగు నూతన సంవత్సరం , ఉగాది స్ఫూర్తి సరిహద్దులు దాటిపోయింది.

తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో, తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొనడం తో పాటుగా భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు మరింత వైభవం జోడించారు.

ప్రతిభను పెంపొందించడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో టివిజి,నిబద్ధత కార్యక్రమం అంతటా స్పష్టంగా కనిపించింది. తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి , తెలుగు సంస్కృతి, చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి.

ఈ కార్యక్రమం లో గౌరవనీయులైన భారత రాయబారి హరీష్ పర్వతనేని, గౌరవనీయులైన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. వీరితో పాటుగా పాల్గొన్న విశిష్ట అతిథులలో ఫ్రాంక్‌ఫర్ట్‌ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి-గ్రున్‌బర్గ్, కొనిగ్‌స్టెయిన్‌ మేయర్ లియోన్‌హార్డ్ హెల్మ్, లాంగేన్ మేయర్ ప్రొఫెసర్, డాక్టర్ జాన్ వెర్నర్, ఏస్చబోర్న్ మేయర్ అద్నాన్ షేఖ్ , న్యూకమర్స్ నెట్ వర్క్ కు చెందిన రాహుల్ కుమార్, డాక్టర్ స్టీఫెన్ సోహెన్జెన్ , యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్‌పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, శ్రీ జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని వున్నారు.

సాయంత్రం హైలైట్‌గా భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృధ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని ,ఇతిపాడ్ బ్యాండ్ నుంచి సాకేత్ కొమండూరి చేసిన సంగీత ప్రదర్శనలు ఉత్సవాలను శిఖరాలకు చేర్చాయి.

Also read : The Heart of a Jnanavatar(169th Birth Anniversary of Sri Sri Swami Sri Yukteswar Giri)

ఇది కూడా చదవండి: ఒక జ్ఞానావతారుని హృదయం శ్రీ శ్రీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారి 169 వ జన్మదినోత్సవం

ఇది కూడా చదవండి: వైఎస్ ఆర్ సిపీ స్టార్ క్యాంపెయినర్లుగా 54 లక్షల మంది సామాన్యులు

ఇది కూడా చదవండి: మస్త్ పెరిగిన వ్యూవర్షిప్.. వాట్ ఏ జగన్ క్రేజ్..

Also read : Alembic Pharmaceuticals Profit up by 78% to Rs. 632 Crores for FY24

ఇది కూడా చదవండి: అక్షయ తృతీయరోజు పూజలు, షాపింగ్ చేయడానికి ముహూర్తం..

error: Content is protected !!