365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 4,2024: ఈ-కామర్స్, ప్రాగ్జిమిటీ పేమెంట్స్‌ను సురక్షితం చేసే విభాగానికి చెందిన ఫ్రెంచ్ దిగ్గజం లైరాతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపీఎల్) జట్టు కట్టింది.
ప్యారిస్‌లోని హాస్‌మాన్‌లో (Haussmann) ఉన్న గాలరీస్ లాఫయెట్ (Galeries Lafayette) ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆమోదయోగ్యతకు ఇది వెసులుబాటు కల్పిస్తుందని తెలియజేయడానికి ఎన్ఐపీఎల్ సంతోషిస్తోంది.
సుసంపన్న సంస్కృతి, అచ్చెరువొందించే ఆర్కిటెక్చర్, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతితో భారతీయ పర్యాటకులకు ప్యారిస్ ఫేవరెట్ పర్యాటక ప్రదేశంగా ఉంటోంది.
ఈ చారిత్రక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో సురక్షితంగా, సౌకర్యవంతంగా యూపీఐ లావాదేవీలను నిర్వహించేందుకు ఈ కొత్త సదుపాయం ఉపయోగపడగలదు. అలాగే పారిస్ సందర్శన అనుభూతిని మరింతగా మెరుగుపర్చగలదు.
ఈఫిల్ టవర్‌లో ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కోసం యూపీఐ విజయవంతంగా అమలవుతోంది. తాజాగా ఎన్ఐపీఎల్-లైరా భాగస్వామ్యం కింద యూపీఐని అందుబాటులోకి తెచ్చిన రెండో ఫ్రాన్స్ దిగ్గజ వ్యాపారసంస్థగా గ్యాలరీస్ లాఫయెట్ నిలవనుంది. ఫ్రాన్స్ మరియు మొనాకోలో భారత రాయబారి శ్రీయుత జావేద్ అష్రఫ్, అలాగే గ్యాలరీస్ లాఫయెట్ సీఈవో శ్రీ నికొలస్ హౌజీ, లైరా గ్రూప్ చైర్మన్ శ్రీ అలైన్ లాకౌర్ వంటి ప్రముఖుల సమక్షంలో ప్యారిస్‌లో ఇందుకు సంబంధించిన ప్రకటన చేయబడింది.
ప్యారిస్‌ను ఏటా పెద్ద సంఖ్యలో సందర్శించే భారతీయ పర్యాటకులు తమకు అనువైన పేమెంట్ విధానమైన యూపీఐని ఉపయోగించి, ప్రతిష్టాత్మకమైన గాలరీస్ లాఫయెట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో చెల్లింపులు జరిపేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడగలదు. యూపీఐని అనుసంధానించడమనేది యూపీఐ ఆధారిత యాప్‌ల ద్వారా షాపింగ్‌ను సులభతరంగా చేసేందుకు, నిరాటంకంగా లావాదేవీలను నిర్వహించేందుకు సహాయకరంగా ఉంటుంది. అలాగే ప్యారిస్ సందర్శన అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. స్టోర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా, పారదర్శకమైన ఎక్స్చేజ్ రేట్లతో, భారతీయ టూరిస్టులు సులభతరంగా చెల్లింపులను పూర్తి చేయొచ్చు.
2024 జనవరిలో ఈఫిల్ టవర్ వద్ద యూపీఐని విజయవంతంగా ఆవిష్కరించడాన్ని, 2024 ఫిబ్రవరిలో భావి వ్యాపారులతో ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సమావేశాన్ని నిర్వహించడాన్ని ఈ సందర్భంగా శ్రీయుత జావేద్ అష్రఫ్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ గ్యాలరీస్ లాఫయెట్‌లో యూపీఐని అందుబాటులోకి తెచ్చే దిశగా, అది కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌కు ముందు, ఒప్పందం వేగవంతంగా కుదుర్చుకోవడాన్ని స్వాగతించారు. 2024 జూలై 26 నుంచి ప్రారంభమయ్యే ప్యారిస్ ఒలింపిక్స్‌ను చూసేందుకు భారతీయ సందర్శకులు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో యూపీఐ ఆమోదయోగ్యత మరింత పెరిగేందుకు, డిజిటల్ చెల్లింపుల మాధ్యమంగా యూపీఐ అంతర్జాతీయంగా ఎదిగేందుకు ఇది దోహదపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ మరియు లైరా సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
“ప్యారిస్‌లోని గ్యాలరీస్ లాఫయెట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడమనేది ప్రతిష్టాత్మకమైన స్టోర్స్‌లో యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మాత్రమే కాకుండా భారతీయ పర్యాటకులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన సీమాంతర చెల్లింపుల సాధనంగా యూపీఐని మరింత వినియోగంలోకి తెచ్చేందుకు కూడా తోడ్పడగలదు. విశ్వసనీయమైన, సమర్ధమంతమైన చెల్లింపు విధానంగా యూపీఐ ప్రాచుర్యం పెరగగలదని, అంతర్జాతీయ మార్కెట్లలోను మరింతగా విస్తరించగలదని విశ్వసిస్తున్నాం” అని ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈవో రితేష్ శుక్లా తెలిపారు.
“యూరప్‌లో తొలిసారిగా ప్యారిస్ హాస్‌మన్‌లోని ఐకానిక్ డిపార్ట్‌మెంట్ స్టోర్ గ్యాలరీస్ లాఫయెట్‌లో యూపీఐ ఇన్-స్టోర్ యాక్సెప్టెన్స్‌ను ఎనేబుల్ చేయడంపై లైరా సంతోషంగా ఉంది. తక్కువ సమయంలో దీన్ని సాధ్యం చేసేందుకు కలిసి పని చేసిన ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్, గ్యాలరీస్ లాఫయెట్, క్యాష్ రిజిస్టర్ ఎడిటర్ లుండి మాటిన్‌కు ధన్యవాదాలు. ఒలింపిక్ గేమ్స్‌ను చూడటానికి భారతీయ టూరిస్టులు ప్యారిస్ వచ్చేందుకు ఇది మరో కారణం కాగలదు” అని లైరా ఇండియా సీఈవో క్రిస్టోఫ్ మారియెట్ తెలిపారు.
“గ్యాలరీస్ లాఫయెట్ హాస్‌మన్‌లో యూపీఐ పేమెంట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా యూరప్‌లో ఈ సదుపాయాన్ని అందించే తొలి డిపార్ట్‌మెంట్ స్టోర్‌గా నిలవడం మాకు సంతోషకరమైన విషయం. యూపీఐని ప్రవేశపెట్టడం ద్వారా మా భారతీయ అతిథులు నిరాటంకంగా, సురక్షితంగా లావాదేవీలను నిర్వహించుకునే వీలు కల్పించడమనేది ఫ్రాన్స్, భారత్ మధ్య సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను పటిష్టంచేసేందుకు కూడా దోహదపడగలదు.
భారత్ నుంచి పర్యాటకుల సంఖ్య పెరిగే కొద్దీ వారికి సౌకర్యవంతమైన, చిరస్మరణీయమైన షాపింగ్ అనుభూతిని కల్పించేందుకు ఈ వినూత్న పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేవడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం.
భారత్‌లో మా తొలి స్టోర్‌ను 2025లో ముంబైలో, అ తర్వాత న్యూఢిల్లీలో మరో స్టోర్‌ను తెరవనున్న నేపథ్యంలో ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యముంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టపర్చడంలో మాకు గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలవగలదు” అని గ్యాలరీస్ లాఫయేట్ సీఈవో నికొలస్ హౌజీ (Nicolas Houzé) తెలిపారు.
ప్రముఖ ఫ్రెంచ్ రిటైల్, టూరిస్ట్ ప్రాంతాల్లో యూపీఐని అనుసంధానించడమనేది యూరప్‌లోని వ్యాపారవర్గాల్లో దాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దోహదపడనుంది. ఫ్రాన్స్ మరియు యూరప్ మార్కెట్లలో యూపీఐ విస్తరించేందుకు, సురక్షితమైన పేమెంట్ సొల్యూషన్‌గా అది తదుపరి వృద్ధి చెందేందుకు, మరింతగా వినియోగంలోకి వచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది.