365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 11,2025: వి.కె. మూవీస్ పతాకంపై యుజిఓస్ ఎంటర్టైన్‌మెంట్స్ సమర్పణలో రూపొందిన “వృషభ” చిత్రానికి అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వం వహించారు. ఉమాశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో జీవన్, అలేఖ్య కథానాయక, నాయకలుగా నటించగా, కృష్ణా, శ్రీలేఖ ముఖ్యపాత్రల్లో కనిపించారు.
కథా సారాంశం:
1960లలో భారతదేశాన్ని ఒక మర్మమైన వ్యాధి కుదిపేసింది. పశువులపై విపరీతంగా ప్రభావం చూపిన ఈ వ్యాధి, పోషకాహార లోపాన్ని పెంచింది. శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని వెతికినా ఫలితం లేకుండా పోయింది. అగ్రశ్రేణి శాస్త్రవేత్త సుశ్రుతానందన్ చివరకు హిమాలయాల్లో ఉన్న రుద్రాక్ష దిగంబర స్వామిని ఆశ్రయిస్తాడు. స్వామి సూచనలతో కైలాసగిరి ప్రాంతానికి వెళ్లిన ఆయన అక్కడి సమస్యలు తెలుసుకుంటాడు.
ఈ కథ 1990 నాటికి వస్తూ బసవుడు అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. తన జీవితంలో ఎదురైన విషాద సంఘటనల నేపథ్యంలో బసవుడు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లోకి అడుగుపెడతాడు. గ్రామీణ మద్యం తయారీదారు అలైవేలుతో ప్రేమలో పడతాడు. అదే సమయంలో దేవుని ఎద్దు అతనిపై దాడికి వస్తుంది. అసలు తన జీవితంలో జరిగే సంఘటనల వెనక ఉన్న నిజం తెలుసుకోవడానికి శివ నందీశ్వర ఆలయ పూజారి నుంచి మార్గదర్శనం పొందే ప్రయత్నం చేస్తాడు.
నటీనటుల ప్రతిభ:
జీవన్, అలేఖ్య, కృష్ణ, శ్రీలేఖ తదితరులు తమ పాత్రలకనుగుణంగా నటించి మెప్పించారు. మాధవి బాటనా డైలాగ్స్ థియేటర్‌లో చక్కగా పేలాయి. గెడ్డం నవీన్, ఫిమా, రియాజ్, బాబీ, రాజమౌళి, నాగు, సుధీర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇది కూడా చదవండి..పీఎం, సీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చనున్న యోగి సర్కార్
ఇది కూడా చదవండి...తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టిఎస్ఆర్డిఏ) నూతన కార్యవర్గం ఏర్పాటు
సాంకేతిక విశ్లేషణ:
సినిమాటోగ్రాఫర్ యుఎస్ విజయ్ కెమెరా వర్క్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటర్ మహేంద్రనాథ్ సరైన కటింగ్‌తో కథను చక్కగా నడిపించారు. సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా అందించిన నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. రామాంజనేయులు రాసిన పాటల లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి.

దర్శకత్వం – కథా మలుపులు:
దర్శకుడు అశ్విన్ కామరాజ్ సినిమా టేకింగ్ బాగుండటంతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా నందీశ్వరుడి కాన్సెప్ట్ స్క్రీన్‌పై బాగా వర్క్ అయింది. క్లైమాక్స్‌లోని 16 నిమిషాలు థ్రిల్లింగ్‌గా నిలిచాయి.
ఇది కూడా చదవండి..హనుమాన్ జయంతి 2025: ముహూర్తం ఎప్పుడు..? పూజ ఎలా చేయాలి..?
Read this also…Swaraj Tractors Teams Up Again with MS Dhoni to Champion Farmers’ Prosperity
విషయప్రాధాన్యతతో కూడిన కథను ప్రజెంట్ చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. “వృషభ” ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి చూడదగ్గ చిత్రం. విభిన్నమైన కథలను ఆస్వాదించే ప్రేక్షకులు తప్పక చూడవలసిన సినిమా ఇది.
365తెలుగు డాట్ కామ్ రేటింగ్: 3/5