365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 5,2024: తల్లులకు పాలు సమృద్ధిగా ఉత్పత్తి అయ్యేందుకు ఇంట్లో ఉండే వైద్య విధానాలు చక్కటి ఫలితాలనిస్తాయి. అందుకోసం ఈ కింది వారిలో ఏదో ఒక విధానాన్ని మాత్రమే అనుసరించాలి. 200గ్రాముల బెల్లంలో 50గ్రాముల శొంఠిపొడి వేసి మొత్తం బాగా కలిపి పూటకు 2-5గ్రాములు చప్పరించి 100మి.లీ. పాలు సేవించాలి.
రోజూ రెండుసార్లు పూటకు 100మి.లీ. పాలలో 3, 4 వెల్లుల్లి పాయల్ని నిలువుగా కత్తిరించి మెత్తగా అయ్యేలా ఉడికించి వెల్లుల్లితోసహా సేవించాలి. జీలకర్ర వేయించి చేసిన చూర్ణం, పటికబెల్లం పొడి ఒక్కొక్కటి 75గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఉదయం, సాయంత్రం పూటకు అర టీస్పూన్ పొడిని 100మి.లీ. పాలలో కలిపి సేవించాలి.
వాముని వేయించి పొడి చేసి రోజూ రెండు పూటలా ఆహారానికి అరగంట ముందు పూటకు 2 గ్రాముల పొడిని తగినంత తేనెతో కలిపి సేవించాలి. 60గ్రాముల చొప్పున మెంతులను వేయించి చేసిన పొడి, పటికబెల్లం పొడి కలిపి ఉంచుకుని రోజూ మూడు పూటలా ఆహారానికి 15నిమిషాల ముందు పూటకి 2గ్రాముల పొడిని 50మి.లీ. నీటిలో కలిపి సేవించాలి. రోజూ ఒకట్రెండుసార్లు పూటకు 150మి.లీ. పాలలో రెండు టీ స్పూన్ల బార్లీ గింజలు, ఒక టీ స్పూన్ పంచదార వేసి మరిగించి దించి చల్లార్చి సేవించాలి.
రోజూ పరగడుపున 100మి.లీ. నీటిలో 10తులసి ఆకులు, 2గ్రాముల అతి మధురం పొడి, అర టీస్పూన్ తాటి కలకండ కలిపి సన్నని మంటపై మరిగించి దించి చల్లార్చి వడగట్టి 50మి.లీ. కాచిన పాలు కలిపి సేవించాలి. రోజూ ఒకసారి 200మి.లీ. పాలలో 30-40గ్రాముల మినప్పప్పు వేసి మెత్తగా అయ్యేలా ఉడికించి చల్లార్చి తగినంత పంచ దార కలిపి సేవించాలి.
బెల్లం, సోంపు గింజల చూర్ణాన్ని, దినుసుకి 150 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని ఉదయం, సాయంత్రం పూట ఒక టీస్పూన్ సేవిస్తుండాలి.
ఆయుర్వేదౌషధవిక్రయశాలలో లభ్య మయ్యే శతావర్యాది చూర్ణాన్ని రెండు పూటలా పూటకు అర టీ స్పూను వంతున 100 మి.లీ. పాలలో కలిపి సేవిస్తుండాలి. ఇలా చేస్తే బిడ్డకు కావాల్సిన పాలు తల్లి నుంచి లభిస్తాయి.
Also read:TATA AIG highlights need for political risk insurance amid global tensions
Also read:These 10 causes of orthopedic problems in the elderly.
Also read:RBI Policy Preview: Time for some dovishness?
ఇదికూడా చదవండి: Poco M6 Plus 5G మొదటి స్మార్ట్‌ఫోన్ ప్రారంభం..
ఇదికూడా చదవండి: మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడితే పరిహారం కోసం కంపెనీని అడగవచ్చు..
ఇదికూడా చదవండి: ఇంఫాల్ టూర్ విశేషాలు..