Tue. Apr 30th, 2024
PRESS CONCIL OF INDIA

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్16,2022: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) భారతీయ పత్రికల వార్తల నాణ్యతను పరిశీలిస్తుంది. పాత్రికేయ కార్యకలాపాలపై నిఘా ఉంచుతుంది. అలాంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని గుర్తించి, గౌరవించటానికి ప్రతి సంవత్సరం నవంబర్16న జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు దేశంలో,బాధ్యతాయుతమైన పెన్ ఫ్రీడమ్ ను సూచిస్తుంది.

జర్నలిజంలో ఇలాంటి వాళ్ళ వల్లే అసలు దరిద్రం..

1956లో మొదటి ప్రెస్ కమిషన్ జర్నలిజం నీతిని కాపాడే బాధ్యత కలిగిన చట్టబద్ధమైన అధికారంతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పత్రికా రంగ ప్రజలతో మమేకం కావడానికి ,తలెత్తే ఏవైనా సమస్యలపై మధ్యవర్తిత్వం వహించడానికి ఓ వ్యవస్థ అవసరమని కమిషన్ భావించింది. 1966లో నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఏర్పడింది. కౌన్సిల్ ఏర్పాటు జ్ఞాపకార్థంగా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16న భారత జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం మొదలైంది.

PRESS CONCIL OF INDIA

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షుడిగా ఉంటారు. 28 మంది అదనపు సభ్యులలో 20 మంది భారతదేశంలో పనిచేస్తున్న మీడియా సంస్థల సభ్యులు. పార్లమెంటు ఎంపీల కేటగిరీ నుంచి ఐదుగురు సభ్యులను నామినేట్ చేస్తారు. సాంస్కృతిక, న్యాయ ,సాహిత్య రంగాలకు చెందిన ముగ్గురు సంభ్యులకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని సభ్యులంతా జర్నలిజం విశ్వసనీయత రాజీ పడకుండా చూసేందుకు పనిచేస్తారు. జర్నలిజం విలువల్ని కాపాడుతూ ఫోర్త్ ఎస్టేట్ పిల్లర్ ను నిజాయితీగా ఉంచేందుకు కృషి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తుంది.