Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మర్చి 9,2024: ప్రపంచంలో కోకా కోలా విక్రయించని రెండు దేశాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయా దేశాల్లో కోకా కోలా అమ్మకాలపై నిషేధం ఉంది. క్యూబా , ఉత్తర కొరియాలలో కోకా కోలా ను చాలా కాలంగా నిషేధించారు.

1961 నుంచి క్యూబాలో నిషేధించారు, ఉత్తర కొరియాలో 1950 నుంచి బ్యాన్ చేశారు.కోకాకోలా 1906లో క్యూబాలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల తరువాత, 1962లో, క్యూబా విప్లవం ప్రారంభమైంది. కోకా కోలా ఉత్పత్తి నిలిపివేశారు.

కాస్ట్రో ప్రభుత్వం విదేశీ కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. కోకాకోలా ఉత్పత్తిని నిషేధించారు. అప్పటి నుంచి కోకాకోలా క్యూబాతో వ్యాపారాన్ని నిలిపివేసింది. ఉత్తర కొరియాలో, 1950, 1953 మధ్య యుద్ధం తర్వాత అమెరికా విధించిన నిషేధం నుంచి కోకా కోలా అక్కడ విక్రయించబడలేదు.