Sun. Dec 22nd, 2024

మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు..

దుష్ప్రచారం.. మీడియా మాయాజాలం..

చంద్రబాబు వాడే అస్త్రాలు ఇవే..

గెలిచాక మాటతప్పడం ఆయన నైజం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్,మే 4,2024: ఎన్నికలకు ముందు ఒకటి చెప్పి, ఎన్నికల తర్వాత ఇంకొకటి చెప్పి ప్రజలను నమ్మించడం ప్రతి సారీ మోసం చేయడం బాబుకి అలవాటే. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబుది పెద్ద రికార్డ్ ..చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తామని 1999 లో హామీ ఇచ్చారు.. పోనీ చేసారా అంటే..? ఉద్యోగాలు ఇచ్చారా ? లేదు.. కానీ తనను తాను ఓ విజనరీ అని మీడియాలో ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు బాబు.

విజనరీ అని చెప్పుకోవడమే తప్ప..

అదే ఏడాది రేషన్ సరుకులు సైతం ఇంటికే ఇస్తాం అని మాట ఇచ్చారు. అదేమైనా చేసారా ? చేయలేదు..కానీ మళ్ళీ తాను విజనరీ అని చెప్పుకుంటారు. ఎంతసేపూ మీడియా ద్వారా తనను తాను సంస్కర్తగా చెప్పుకుంటూ రాష్ట్రానికి తానె దిక్కు అనేలా ప్రచారం చేసుకోవడం మినహా… ఇన్నేళ్ళలో ఇదిగో…నేను ఇది చేశాను అని చెప్పుకునేందుకు ఏమీ లేదు… కానీ మళ్ళా ఆంధ్రాకు నేనే దిక్కు అంటారు

పెన్షన్లు.. ఇతర అంశాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా దాన్ని మళ్ళీ ఎదురు జగన్ మోహన్ రెడ్డి మీదకు నెట్టేయడం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు పేరిట ప్రజల భూములు లాక్కుంటారంటూ అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ప్రజలను నమ్మించి లబ్ధిపొందడానికి చంద్రబాబు వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు.. కానీ విజ్ఞులైన ప్రజలు మాత్రం తమకు ఎవరేమిటన్నది తెలుసనీ… ఎన్నికల సమయంలో ఓటుతో సమాధానం చెబుతామని అంటున్నారు.

ఇది కూడా చదవండి: 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించిన L&TMRHL.

Also read: Raymond Delivers Highest Ever Annual and Ǫuarterly Revenue and Profitability

ఇది కూడా చదవండి: అబద్ధాల ప్రచారంలో మౌత్ టాక్ మల్లిగాళ్ళు

Also read: Kalasha Naidu of Kalasha Foundation Felicitated with Honorary Doctorate

Also read: SK Finance Limited files DRHP with SEBI for an IPO..

ఇది కూడా చదవండి: 2024 మే 8న ప్రారంభం కానున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్..

error: Content is protected !!