Fri. Nov 8th, 2024

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పాలిట విలన్ చంద్రబాబు

ఏ మంచినీ అంగీకరించని వైనం

రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టని బాబు

సీఎం వైయస్ జగన్ చేసే ప్రతిపనికీ మోకాలడ్డు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 4,2024: చంద్రబాబు తీరే అంత…ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవు .ఆయన ఏపని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే.

సీఎం వైయస్ జగన్ చేసే ప్రతి పనిని..ప్రతి మంచిని అడ్డుకోవడమే చంద్రబాబు రాజకీయ వ్యాపకంగా పెట్టుకున్నారు.

గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి వ్యతిరేకించి జనంలో చంద్రబాబు వెర్రిపప్ప అయ్యారు. వాలంటీర్లు మీద ఇష్టానుసారం కామెంట్లు చేసి తరువాత తీవ్రవ్యతిరేకత రాగానే నాలుక కరచుకుని ..లేదు లేదు..నేను వాలంటీర్లును కొనసాగిస్తాను..పైగా పదివేలు జీతం ఇస్తాను అన్నారు. ఈవిషయంలో ఆయన ఈసారి కొండెర్రీ పప్ప అయ్యారు.

అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని సైతం అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లారు..కేసులు వేశారు. ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ఇష్టానుసారం వాగుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు.

భూములకు మరింత భద్రత కల్పిస్తూ అక్రమాలు . కబ్జాలు.. రికార్డుల మార్పిడి వంటి అక్రమాలకు తా లేకుండా పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు జగనన్న చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడమే కాకుండా ప్రజలను గందరగోళ పరుస్తూ మాట్లాడుతున్నారు. తనకు చేతకానిది వేరే వాళ్ళు చేస్తే సహించలేని చంద్రబాబు ఇప్పుడు ప్రజలను భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.

చంద్రబాబును ముప్పయ్యేళ్ళుగా చూస్తున్న

ప్రజలు మాత్రం నిన్ను నమ్మం బాబు . జగన్ అంటే విశ్వసనీయతకు ఒక బ్రాండ్ .ఆయన లక్షల ఎకరాల చుక్కల భూములకు రైతులకు హక్కుదారులను చేశారు. లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు ఇచ్చారు. 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు.

పేదల కోసం… ప్రజల కోసం ఇన్ని పనులు చేసిన జగన్ పేదల..రైతుల భూములు తీసుకుంటారు అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు..మళ్ళీ జగనే వస్తాడు .మా నమ్మకం జగన్ అంటున్నారు.

Also read: ZEE5, Radhika Sarath Kumar’s “Thalaimai Seyalagam” teaser out, gets a streaming date

ఇది కూడా చదవండి: ZEE5 రాధికా శ‌ర‌త్ కుమార్ క‌ల‌యిక‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘తలమై సెయల్గమ్’లో ప్రధాన పాత్రధారిగా ‘సలార్’ ఫేమ్ శ్రియారెడ్డి

Also read: IDBI Bank Limited – Financial Results for Q4 & FY 2024 ..

ఇది కూడా చదవండి: 46 కోట్ల రీఫండ్ మోసానికి పాల్పడిన ఐదుగురు తెలంగాణ జీఎస్టీ అధికారులను పోలీసులు అరెస్ట్

ఇది కూడా చదవండి: శింగనమల నియోజకవర్గంలో మళ్లీ శైలజానాథ్ దే గెలుపు..?

ఇది కూడా చదవండి: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు..

ఇది కూడా చదవండి: 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించిన L&TMRHL.

error: Content is protected !!