365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10, 2025: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తమిళ దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న కొత్త చిత్రం AA22ని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సై-ఫై యాక్షన్ చిత్రం ప్రకటన వీడియో విడుదలైన కాస్సేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులు జేమ్స్ మాడిగన్ (ఐరన్ మ్యాన్ 2), మైక్ ఎలిజాల్డే, ఆస్కార్ విజేత జస్టిన్ రాలీ స్క్రిప్ట్‌ను ప్రశంసించడంతో అంచనాలు పెరిగాయి. అయితే, ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన తర్వాత వివాదం తెరపైకి వచ్చింది.
ఇది కూడా చదవండి…డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్‌కు రెడీ
Read this also…‘Zee Telugu Unveils Drama Juniors Season 8 with a Star-Studded Grand Launch
సోషల్ మీడియా వేదిక Xలో చాలా మంది ఈ పోస్టర్‌ను టిమోతీ చల్మెట్ నటించిన హాలీవుడ్ చిత్రం “డ్యూన్” పోస్టర్‌తో పోల్చారు. మరో పోస్టర్‌ను ఇంటర్‌స్టెల్లార్తో పోల్చి, అట్లీపై “కాపీ కొట్టారు”, “ఒరిజినాలిటీ లేదు” అంటూ విమర్శలు గుప్పించారు.

“దేశంలో ఇంత ప్రతిభ ఉంటే ఎందుకు కాపీ చేయాలి? అలా చేసినా ఇంత బహిరంగంగా ఎందుకు?” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, “పోస్టర్ బాగుంది కాబట్టి రిస్క్ తీసుకున్నారేమో” అని మరొకరు అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి…‘ప్రేమకు జై’ ఏప్రిల్ 11న విడుదల…
Read this also…‘Premaku Jai’ Set to Captivate Theatres on April 11
సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను “మాస్ ప్రారంభమైంది! #AA22xA6కి 6 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సన్ పిక్చర్స్ నుంచి ఓ మాగ్నమ్ ఓపస్” అని పేర్కొంది. కానీ ప్రస్తుతానికి సినిమా కంటే పోస్టర్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. అట్లీ గతంలో కూడా జవాన్ సినిమాతో సమానమైన కాపీ వివాదాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం AA22పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.