365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, 2024:ఈ ఐదుగురు స్నేహితులు ప్రతిరోజూ సాయంత్రం ఓ కాలనీలోని పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీరిలో శేఖర్ మంచి చిత్రకారుడు. ఓ యాడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆవేశం కారణంగా ఉద్యోగాన్ని వదిలేస్తాడు. హరి నటుడు కావాలన్న అభిలాషతో ప్రయత్నాలు సాగిస్తూ ఓ సారి మోసపోతాడు.

వాసు ఓ కంపెనీలో చిరుద్యోగి. దిగువ మధ్యతరగతికి చెందిన అతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడి బాధ్యత కూడా ఉంటుంది. కుమార్ ఓ ధనవంతుని తనయుడు. గాంధీ ఉద్యోగాల వేటలో బిజీ. వీరుండే కాలనీలోకి గీత అనే అమ్మాయి, ఆమె తండ్రి చేరతారు. ఓ సారి ఆమె తండ్రితో కుమార్ గొడవ పడినా, ఆ తరువాత గీత కారణంగా అందరూ వారితో స్నేహం చేస్తారు. శేఖర్ కు గీత అంటే ఆరాధన, ఆమెకు కూడా అతనిపై అభిమానం ఉన్నట్టు కనిపిస్తుంది.

ఆమె ఎక్కడికైనా వెళ్తే శేఖర్ కూడా తోడుగా వెళ్తూ ఉంటాడు. ఇక వాసూని ఓ సారి గీత అన్నగా సంబోధిస్తుంది. అప్పటి నుంచీ ఆమెను వాసూ కూడా సొంత చెల్లెలు గానే భావిస్తుంటాడు. ఈ ఐదుగురు జీవితాలు గీత రాకతో మారిపోతాయి. అందరూ తమ కాళ్ళపై తాము నిలవాలని నిర్ణయించుకుని తగిన ఉద్యోగాల్లో చేరతారు. వాసు చెల్లెలి పెళ్ళి కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఆగిపోతుంది.

శేఖర్ నే వాసు చెల్లిని పెళ్ళి చేసుకోమని గీత చెబుతుంది. తానంటే అభిమానం లేక అలా చెబుతుందని నిలదీస్తాడు శేఖర్. కానీ అప్పుడే అతనికో భయంకరమైన నిజం తెలుస్తుంది. గీత ఓ నయం కాని గుండె జబ్బుతో బాధ పడుతోందని, ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకుంటాడు. ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదని శేఖర్ అడిగితే తన కోసం ఎవరూ బాధ పడటం, జాలి పడడం ఇష్టం లేకనే చెప్పలేదని అంటుంది గీత.

ఆమె అభ్యర్ధన మేరకు శేఖర్ వాసూ చెల్లిని పెళ్ళి చేసుకుంటాడు. గీత పెళ్ళి మండపం లోనే పడిపోతుంది. ఆసుపత్రిలో గీత చుట్టూ ఈ ఐదుగురూ చేరతారు. అందరినీ బాధ పెడుతూ గీత నవ్వుతూ కన్ను మూస్తుంది. ఈ ఐదుగురు మిత్రులు ఎప్పుడూ కలుసుకునే పిట్ట గోడపైకి మరో ఐదుగురు కొత్త తరం కుర్రాళ్ళు వచ్చి కూర్చుని ముచ్చటించు కుంటుండగా ముగిసే చిత్ర కధతో,..’ నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం మంచి తెస్తావని మంచి చేస్తావని ‘..’

మేఘమా దేహమా మేరవకే ఈ క్షణం మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం ‘..వంటి పాటలతో శ్రీ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో,.. ‘ మనిషే మణిదీపం మనసే నవనీతం ‘.. ‘ పగలు రేయిలో జారక ముందే ‘.. అనే రెండు పాటలను ” శ్రీ శ్రీ ” రాసారు .. ఇదండి మంచు పల్లకి కథ. వంశీ దర్శకత్వం లో చిరంజీవి, సుహాసినిలకు మంచి పేరు తెచ్చిన చిత్రం. మిగతా నలుగురు పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, నారాయణరావు, సాయి చంద్, గిరీష్ నటించారు.

“మంచు పల్లకి ” సినిమా షూటింగ్ సందర్భంగా చిరంజీవితోపాటు ఇతర నటులు మాట్లాడుకుంటున్నప్పుడు తీసినఫొటో ఇది..

ఇది కూడా చదవండి: ప్రతి డ్యాన్స్‌లో ఆరోగ్య రహస్యాలున్నాయి..

ఇది కూడా చదవండి: ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం..

ఇది కూడా చదవండి: జై జగన్ అంటున్న ఉద్యోగులు..పోస్టల్ బ్యాలెట్ మొత్తం జగన్ వైపు..

Aslo readYou may eliminate tension and grief in this way.

ఇది కూడా చదవండి: దుఃఖాన్ని, ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు ఇలా..

ఇది కూడా చదవండి: ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పాలిట విలన్ చంద్రబాబు..