365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 4,2024:మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)లోని ఫార్మ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్‌లో భాగమైన, భారతదేశపు నంబర్ 1 ట్రాక్టర్ బ్రాండ్ మహీంద్రా ట్రాక్టర్స్ భారతీయ రైతాంగం పట్ల గౌరవసూచకంగా ‘దేశ్ కా ట్రాక్టర్: మిట్టీ సే జుడా, జునూన్ సే సజా’ అనే విశిష్ట కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.
మహీంద్రా ట్రాక్టర్ ప్రారంభమై 60 ఏళ్లు కావడంతో పాటు 1963 నుంచి 40 లక్షల ట్రాక్టర్ యూనిట్లను విక్రయించిన సందర్భంగా దీన్ని ప్రారంభించింది.
ఆరుగాలం శ్రమించే దేశపు రైతాంగం పట్ల గౌరవసూచకంగా, మహీంద్రా ‘యువో టెక్ ప్లస్’ ట్రాక్టర్ డిజైన్ ప్రేరణతో, రైతాంగ పటిమను ప్రతిబింబించేలా ట్రాక్టర్ థీమ్‌తో ఒక లైఫ్-సైజ్ ట్రాక్టర్ శిల్పాన్ని మహీంద్రా ట్రాక్టర్స్ ప్రదర్శించింది. వినూత్నమైన, సృజనాత్మకమైన ఈ శిల్పం భారతీయ సాగు రంగంలోని వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తుంది.
మహీంద్రా,భారతీయ రైతుల మధ్య గల పటిష్టమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ దేశవ్యాప్తంగా 4,000 పైచిలుకు పొలాల నుంచి సేకరించిన వివిధ రకాల మట్టిని మేళవించి ఇది రూపొందించబడింది.
‘మిట్టీ సే జుడా, జునూన్ సే సజా’ అనేది, ఎలాంటి నేలల్లోనైనా సమర్ధమంతంగా పని చేయగలిగే, నేలతో ముడిపడి ఉండే, ఆచరణాత్మకమైన సాగు సాధనాలను సృష్టించాలన్న మహీంద్రా ట్రాక్టర్స్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
సాగు రంగంలో పరివర్తన తెచ్చి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రైతుల జీవితాలను మెరుగుపర్చాలన్న ఆకాంక్షకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. గత 60 ఏళ్లుగా సాగుతున్న ఈ బృహత్ కార్యక్రమం ఇకపైనా కొనసాగుతుంది.
నాగ్‌పూర్‌లోని కంపెనీ తయారీ ప్లాంటులో నిర్వహించిన కార్యక్రమంలో మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ ఫార్మ్ డివిజన్ సీఈవో శ్రీ విక్రమ్ వాఘ్ సమక్షంలో శిల్పం ఆవిష్కరించబడింది.
ఈ కార్యక్రమ విశిష్టతను వివరిస్తూ, “60 ఏళ్లలో 40 లక్షల మంది కస్టమర్లకు సేవలందించడమనే మైలురాయిని సాధించాం. రైతులు మాపై ఉంచిన నమ్మకమే మాకు ఈ ఘనత దక్కేలా చేసింది. మహీంద్రా ట్రాక్టర్స్ మరియు నిరంతరం కష్టించి పని చేసే, సాహసోపేతమైన భారతీయ రైతుకు మధ్య గల పటిష్టమైన బంధాన్ని ప్రతిబింబించేలా ‘దేశ్ కా ట్రాక్టర్’ను రూపొందించేందుకు ఇది ప్రేరణనిచ్చింది. ఈ మైలురాయిని సాధించడంలో మాకు సహాయపడిన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను” అని శ్రీ వాఘ్ తెలిపారు.
60 ఏళ్లుగా మహీంద్రా మొత్తం 390 పైచిలుకు ట్రాక్టర్ మోడల్స్‌తో తమ ఉత్పత్తుల శ్రేణిని గణనీయంగా విస్తరించింది. ఈ వ్యవధిలో మహీంద్రా ట్రాక్టర్స్, కస్టమర్ సౌలభ్యమే పరమావధిగా, భారతదేశవ్యాప్తంగా 1,200 పైచిలుకు డీలర్ భాగస్వాములతో భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.
40 లక్షల మైలురాయిని దాటి మరింతగా పెరుగుతున్న మహీంద్రా ట్రాక్టర్ల కస్టమర్లకు అసమానమైన సేల్స్, సర్వీస్, స్పేర్స్‌పరమైన మద్దతును అందించేందుకు ఇది తోడ్పడుతోంది.