Mon. May 6th, 2024
RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌. జూలై 24,2021:సమగ్రమైన  రివర్శ్‌ లాజిస్టిక్స్‌ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన, మునిచ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రివర్శ్‌ లాజిస్టిక్స్‌  గ్రూప్‌ (ఆర్‌ఎల్‌జీ)కు అనుబంధ సంస్ధ అయినటువంటి ఆర్‌ఎల్‌జీ ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరం కోసం తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం క్లీన్‌ టు గ్రీన్‌ (సీ2జీ)కింద క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమాన్ని పరిచయం చేయడం ద్వారా కంపెనీ,అవగాహన,కలెక్షన్‌ వ్యూహాలను వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక అవగాహన కార్యక్రమం, దీని విధానం కారణంగా వినూత్నమైనది కావడమే కాదు, దీని కవరేజీ పరంగా కూడా విభిన్నమైనది!

RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22
RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22

కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (మీటీ) మంత్రిత్వశాఖ మార్గనిర్ధేశకత్వంలో,డిజిటల్‌ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ లో భాగంగా తొమ్మిది మినీ వాణిజ్య వాహనాలు (చోటా హాట్టి)లు భారతదేశ వ్యాప్తంగా ఒక లక్ష కిలోమీటర్లకు పైగా తిరుగనున్నాయి;అవి వైవిధ్యమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా 110 నగరాలు,300 పట్టణాలను చేరుకోనున్నాయి.ఈ కార్యక్రమ ప్రధానోద్దేశ్యం పాఠశాల విద్యార్థులు, కార్పోరేషన్స్‌,బల్క్‌కన్స్యూమర్‌,రిటైలర్లు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు(ఆర్‌డబ్ల్యుఏలు),డీలర్లు ,అసంఘటిత రంగం,  ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను చేరుకుని ఈ-వ్యర్ధాలతో సంబంధం కలిగి ఉన్న ప్రమాదాలు,చేయాల్సిన, చేయకూడని అంశాలను గురించి తెలుపడం. క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం తుది వినియోగదారులకు పూర్తి స్థాయిలో అవగాహనను  ఆర్గానిక్‌-ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ లక్ష్యంతో అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తంమ్మీద 326 పాఠశాలలను, 188 ఆర్‌డబ్ల్యుఏలు,134 ఆఫీస్‌ క్లస్టర్స్‌/బల్క్‌కన్స్యూమర్లు, 176 రిటైలర్లు, 156 అసంఘటిత రంగాలు, 4 ఆరోగ్య సంరక్షణ క్యాంప్‌లను వర్క్‌షాప్‌ల ద్వారా చేరుకోవడంతో పాటుగా 4వేలకు పైగా కలెక్షన్‌ ప్రోగ్రామ్‌ యాక్టివిటీలను సైతం చేరుకోనుంది.

RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22
RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22

ఈ కలెక్షన్‌ డ్రైవ్‌ను జూలై 23వ తేదీన తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏ–3, ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌,సనత్‌ నగర్‌, హైదరాబాద్‌ వద్ద ప్రారంభించారు.

ఈ కార్యక్రమం కింద పలు ఈ-వ్యర్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇది ఈ-వ్యర్థ సంబంధితనిర్ణయాలపై ప్రభావం చూపడంతో పాటుగా వినియోగదారుల ప్రవర్తనపై మార్పు తీసుకువచ్చి అనుకూలమైన ప్రక్రియలను స్వీకరించేందుకు సైతం తోడ్పడుతుంది. ఆర్‌ఎల్‌జీ ఇండియా  భారతదేశ వ్యాప్తంగా స్టూడెంట్‌ వీడియోగ్రఫీ పోటీలను నిర్వహించనుంది. దీనిలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రస్తుత ఈ-వ్యర్థ సమస్య ,దానికి అత్యుత్తమ పరిష్కారం అనే అంశాలపై వీడియో సృష్టించాల్సి ఉంటుంది. ఈ పోటీల విజేతలు సృష్టించిన వీడియోను 2021–22 ఆర్ధిక సంవత్సరం కోసం క్లీన్‌ టు గ్రీన్‌ బ్రాండ్‌ వీడియోగా వినియోగిస్తారు.

RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22
RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22

ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలలో సాధారణంగా పారవేసిన సర్వర్లు ,కంప్యూటర్‌మానిటర్లు, మదర్‌బోర్డ్‌లు, ప్రింటర్లు,మొబైల్‌ ఫోన్లు,చార్జర్లు, కంపాక్ట్‌ డిస్క్‌లు,హెడ్‌ఫోన్స్‌,వాషింగ్‌ ఫోన్లు, ఎయిర్‌ కండీషనర్లు మొదలైనవి ఉంటాయి. ప్రపంచంలో ఈ–వ్యర్థాల సృష్టిలో మూడవ స్థానంలో భారతదేశం ఉంది.

RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22
RLG Launched Clean to Green on Wheels; Aims to reach out to 4 million people across India in FY 2021-22

క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి నీతు కుమారి ప్రసాద్‌, ఐఏఎస్‌, మెంబర్‌ సెక్రటరీ, టీఎస్‌ పీసీబీ మాట్లాడుతూ ‘‘సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలు దేశాభివృద్ధి పరంగా నూతన,వినూత్నమైన అవకాశాలను అందించినప్పటికీ, ఆ ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులు పనికిరాకుండా పోయినప్పుడు  వాటిని తగిన రీతిలో,అత్యంత జాగురుకతతో నాశనం చేయాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది.క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం లక్షలాది మంది ప్రజలను చేరుకునే వినూత్న అవకాశం.తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన,పచ్చదనంతో కూడిన పర్యావరణం కోసం ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను తగ్గించడం,  పునర్న్వియోగించడం,నాశనం చేయడం పరంగా సరైన విధానాలను ప్రచారం చేయడానికి ప్రచారకర్తలుగానూ మారనున్నారు’’ అని అన్నారు.

ఊహాతీత సంక్షోభ కాలంలో 2021–22 ఆర్థిక సంవత్సరం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గురించి శ్రీమతి రాధికా కాలియా, ఎండీ, ఆర్‌ఎల్‌జీ ఇండియా మాట్లాడుతూ ‘‘ఓ కంపెనీగా, మేము స్థిరంగా మా లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేస్తూనే, కోవిడ్‌ –19  మహమ్మారి అవరోధాలను సృష్టించినప్పటికీ దేశంలో ఈ–వ్యర్థ నిర్వహణ మౌలిక వసతులును ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాము. ఈ తాజా ఈ–వ్యర్ధ అవగాహన కార్యక్రమం ద్వారా, దేశవ్యాప్తంగా వీలైనంత త్వరగా పర్యటించడం ద్వారా  తగిన ఈ–వ్యర్థ  నాశన, రీసైక్లింగ్‌ పద్ధతులను స్వీకరించాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు సరైన అవగాహనను కల్పించడానికి ప్రయత్నించనున్నాం. ఆర్‌ఎల్‌జీ ఇండియా వద్ద, మేము ఈ–వ్యర్ధ నిర్వహణ విభాగంలో ఓ గేమ్‌ ఛేంజర్‌గా  క్లీన్‌ టు గ్రీన్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం నిలువనుందనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.