365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,చండీగఢ్, ఏప్రిల్ 23,2024:మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ తమ గోల్డెన్ జూబిలీ సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. కచ్చితత్వంతో, పసిడి వర్ణ సొగసులతో తీర్చిదిద్ధిన ఈ లిమిటెడ్-ఎడిషన్ ట్రాక్టరు, కస్టమర్ల పట్ల స్వరాజ్‌కి గల నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.
ప్రధానమైన గోల్డెన్ డెకాల్స్ మొదలుకుని ప్రముఖ కస్టమరు, స్వరాజ్ బ్రాండ్ ప్రచారకర్త కూడా అయిన ఎంఎస్ ధోనీ సంతకం వరకు ఈ విశిష్టమైన మోడల్ అత్యంత స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్డింది.
స్వరాజ్ ట్రాక్టర్స్ 50వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్వరాజ్ 855 FE, స్వరాజ్ 744 FE ట్రాక్టర్ల పరిమిత-ఎడిషన్ వేరియంట్లు ప్రదర్శించాయి. ఈ వేడుకలు స్వరాజ్ సుసంపన్న వారసత్వానికి, తమ భాగస్వాములందరి పట్ల సంస్థకు గల కృతజ్ఞతకు నిదర్శనంగా నిల్చాయి.
ఈ లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్ దేశవ్యాప్తంగా రెండు నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది అయిదు స్వరాజ్ వేరియంట్స్ – 843 XM, 742 XT, 744 FE, 744 XT, అండ్ 855 FE లో లభిస్తుంది.
దేశవ్యాప్తంగా 50,000 మంది పైచిలుకు కస్టమర్లకు చేరువైన జాతీయ స్థాయి ప్రచార కార్యక్రమం జోష్ కా స్వర్ణోత్సవ్ దీనితో చరమాంకానికి చేరుకుంది. దేశ్ కీ మిట్టీ పేరిట భారతదేశవ్యాప్తంగా ప్రతి మూల నుంచి సేకరించిన మట్టితో రూపొందించిన సైకత కళలు ఈ సందర్భంగా ఆకర్షించాయి.
దేశవ్యాప్తంగా ఉన్న స్వరాజ్ మూలాలకు ఇవి ప్రతిబింబిస్తాయి. స్వరాజ్ అసమానమైన ప్రస్థానాన్ని కళ్ళకు కట్టేలా వివరించే విధంగా దేశవ్యాప్తంగా భాగస్వాముల భావోద్వేగభరితమైన వీడియో ఆహూతులను కదిలించింది.
స్వరాజ్ సుసంపన్న వారసత్వాన్ని ప్రతిఫలించే కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణతో ఈ కార్యక్రమం శోభ మరింతగా పెరిగింది. ఇందులో సంస్థ యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పొందుపర్చారు. కేవలం ఉపాఖ్యానాలకే పరిమితం కాకుండా ఇది స్వరాజ్ ఘన చరిత్ర, ప్రస్థానం, భాగస్వాములతో సంస్థకు గల అనుబంధాన్ని చిరకాలం గుర్తుండిపోయే విధంగా వివరిస్తుంది.
ఈ భావోద్వేగభరిత సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ ‘స్కిలింగ్ 5000’ పేరిట కొత్త సీఎస్ఆర్ ప్రోగ్రాంను ప్రకటించింది. మహీంద్రా గ్రూప్ ప్రధాన సూత్రమైన ‘టుగెదర్ ఉయ్ రైజ్’, ‘సాగు రంగంలో పరివర్తన తేవడం, జీవితాలను సుసంపన్నం చేయడం’ అనే ఎఫ్ఈఎస్ లక్ష్యానికి అనుగుణంగా సమాజంలో సానుకూల మార్పు తేవాలన్న స్వరాజ్ సంకల్పానికి ఇది ప్రతీకగా ఉంటుంది.
‘స్కిలింగ్ 5000’ ద్వారా మహిళలు, దివ్యాంగులకు వ్యవసాయం, ఇతర రంగాల్లో వొకేషనల్ నైపుణ్యాలను కల్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించాలని స్వరాజ్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Also read : Swaraj Unveils Exquisite Limited-Edition Tractor to Commemorate its Golden Jubilee.
Also read :HDFC Mutual Fund Launches HDFC Manufacturing Fund
Also read : Reliance Jio is now the World’s Largest Mobile Operator in Data Traffic surpassing China Mobile.
ఇది కూడా చదవండి: డేటా ట్రాఫిక్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా జియో..
ఇది కూడా చదవండి: తగ్గిన OnePlus 5G స్మార్ట్‌ఫోన్ ధర..