Tue. Apr 30th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూన్ 8,2023: ఆనెకాయలు (Calluses) అనేవి మన చేతులు, కాళ్ళ చుట్టూ చర్మం పైన కఠినమైన చర్మంతోకూడిన మచ్చలు (patches). అవి కేవలం బాధించేటివీ ,అసౌకర్యమైనవే కాదు, చూడడానికి కూడా ఆహ్లాదకరమైనవేం కాదు. ఆనెకాయలు ఓ తీవ్రమైన సమస్య కాదు, కానీ అవి వాటిని సులభంగా నివారించవచ్చు…నయమూ చేసుకోవచ్చు.

ఆనెకాయలు,ఆనెలు (corns) రెండూ ఒకటి కాదు. తరచుగా ఆనెకాయల్నే ఆనెలుగా వ్యవహరిస్తూ పొరపాటు పడటం జరుగుతోంది. ఆనెలు,ఆనెకాయలు రెండూ కూడా ఘర్షణకు విరుద్ధంగా ఏర్పడే ప్రక్రియలో రక్షించుకోవడానికి చర్మపు కఠిన పొరలతో ఏర్పడ్డవే అయినా అనెకాయలు సాధారణంగా ఆనెల కంటే పెద్దవిగా ఉంటాయి.

అనెకాయలు కేవలం ఆనెలు ఏర్పడేచోట్లలోనే కాక వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడతాయి, అరుదుగా ఎప్పుడూ బాధాకరమైనవే.

ఆనెకాయలు ప్రధాన సంకేతాలు,లక్షణాలు ఏమిటి?

ఆనెకాయలు ముఖ్యంగా అడుగుల కింది అరికాళ్ళు లోని మడిమెల్లో (హీల్స్), (పాదం బంతుల్లో) ముందు భాగంలో, అరచేతులు లేదా మోకాళ్లు; శరీరం భంగిమలు, కదలికల నుండి కలిగే ఒత్తిడిని భరించే కేంద్రభాగాల్లో ఎక్కువగా ఏర్పడతాయి. అవి సాధారణంగా ఈ క్రింది విధంగా కనిపిస్తాయి.

గట్టి బుడిపె లాగా పైకి ఉబికి ఉంటాయి.

గట్టిగా నొక్కినప్పుడు బాధాకరంగా ఉంటాయి. లేదా దాని ఉపరితలం క్రింద లోతులో సున్నితత్వంతో కూడిన నొప్పి కల్గుతుంది.చర్మంపై మందమైన చర్మంతో కూడిన కఠినమైన పాచ్ (మచ్చ)చర్మం మైనంలాగా, పొడిగా , పొరలు (పొలుసులు) గా కనిపిస్తుంది.

ఆనెకాయలకు ప్రధాన కారణాలు ఏమిటి?


ఆనెకాయలకు ప్రధాన కారణం ఘర్షణ లేక రాపిడి. పాదాలకు ఈ ఘర్షణ లేదా రాపిడి ఎందుకు కలుగుతుందంటే:పాదరక్షలు చాలా గట్టివి (hard) లేదా చాలా బిగుతు (tight )గా ఉన్నవి వేసుకోవటం వల్ల కొన్ని సంగీత వాయిద్యాలను వాయించడం ద్వారా జిమ్ పరికరాలతో పని చేయడం, బ్యాట్ లేదా రాకెట్ ను పట్టుకుని ఆడే క్రీడలో ఆడటం వల్ల,తరచుగా చాలా దూరాలకు సైకిల్ లేదా మోటారుబైక్ పై స్వారీ , బూట్లు తో పాటు మేజోళ్ళు (సాక్స్) ధరించకపోవడం వల్ల కాలిబొటనవ్రేలి గోరుచుట్టు లేక మడమ శూలలు (Bunions) ,కాలిగోళ్ల వికృతరూపాలు లేదా ఇతర వైకల్యాలు ఆనెకాయల (calluses) ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆనెకాయల నిర్ధారణను ఎలా చేస్తారు , దీనికి చికిత్స ఏమిటి?

ఆనెకాయలను (calluses) అన్ని సమయాలలో సాక్స్లతో చక్కగా అమర్చిన బూట్లు ధరించడం. ఆనెలు హాని చేయవు..!

1.-ముఖ్యంగా కాళ్లకి చెప్పులు లేకుండా పొలాల్లో తిరిగే వారి పాదాలకి ఆనెలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
-బయట ప్రదేశాల్లో, ఇసుకప్రాంతాల్లో తిరగాలంటే ఆనెలు ఉన్న వారికి నరకయాతనే.

ఆనెలను పోగొట్టే హోమ్‌రెమిడీస్‌ ఏంటో తెలుసుకుందాం.

కలబందని పేస్ట్‌ చేసి ఆ మిశ్రమాన్ని ఆనెకి పూయాలి. ఈ భాగంలో కాలికి బ్యాండేజ్‌ చుట్టాలి. కొన్ని రోజులపాటు ఇలా చేస్తే మంచిఫలితం ఉంటుంది.
A-తులసి ఆకుల్ని ఆముదంనూనెతో కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఆనె ఉండే చోటు పట్టించి కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి.
B-వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి ఆనె ఉండే చోటు కట్టుగా కట్టాలి. వెల్లుల్లి బాక్టీరియాని చంపేస్తుంది. దీంతో పాటు ఆనెలకి చక్కటి మందులాగా పనిచేస్తుంది.
C-ఒక చుక్క వెనిగర్‌ ని ఆనెపై వేసి అక్కడ కాస్త దూదిని పెట్టి కట్టు కట్టి అలాగే కొద్దిసేపు ఉంచటం వల్ల తగిన ఫలితం కనిపిస్తుంది.


మందులు
1.-Clostar SCLOSTAR S OINTMENT 15GM
2.-Halonext SHALONEXT S OINTMENT 30GM
3.-Eczmate SECZMATE S 15GM OINTMENT
4.-ElosalicElosalic Ointment207Hh
5.-Momoz SMomoz S Ointment
6.-Mone SMone S 0.01% Ointment
7.-Momate SMOMATE S OINTMENT 10GM
8.-Momtas SMomtas S Ointment
9.-Momtop SMomtop S Ointment
10.-Saltopic MSaltopic M Ointment

పాదాల నొప్పులకు
1.-జిల్లేడు పువ్వు ఆముదం లే కొద్దిగా వేయించి పేస్ట్ మడిమ చుట్టూ పూయండి…
2.-ఇటుక మంటలో కాల్చి కాటన్ క్లోత్ లో పెట్టి కాపండి.
3.-ఒక గిన్నెలో వేడి నీళ్లు ఒక గిన్నెలో చల్లటి నీళ్లు పెట్టుకొని ఒక గిన్నెలో 10సెకన్లు ఇంకో గిన్నెలో 10సెకన్లు మార్చి మార్చిపెట్టాలి.. …ఇలా చేస్తే వారంలో తగ్గిపోతుంది.